Tirumala: ముగిసిన పాక్షిక చంద్రగ్రహణం.. తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
Tirumala: ఆలయాన్ని శుద్ధి చేసిన సిబ్బంది
Tirumala: ముగిసిన పాక్షిక చంద్రగ్రహణం.. తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
Tirumala: పాక్షిక చంద్ర గ్రహణం ముగియడంతో పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం ద్వారాలను తెరుచుకున్నాయి. గ్రహణం కారణంగా 8 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయ సన్నిధి గొల్ల ఆలయాన్ని తెరువగా, అర్చకులు, సిబ్బంది శుద్ధి, పుణ్యాహవాచనం నిర్వహించి శ్రీవారికి నిత్యం కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం కంపార్టమెంట్లలో వేచివున్న భక్తులను టీటీడీ దర్శనానికి అనుమతించింది.