విద్యా వ్యవస్థలో సమూల మార్పులు : సీఎం జగన్ కొత్త వెబ్‌సైట్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీలలో వసతులకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్ సైట్ లో చూసి పిర్యాదు చేసేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-05-28 05:00 GMT
YS Jagan(File photo)

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీలలో వసతులకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్ సైట్ లో చూసి పిర్యాదు చేసేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం విద్యను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఇక నుంచి ప్రైవేటు కాలేజీలలో అన్ని వసతులు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని నేరుగా వెబ్ సైట్ లో చూసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.

విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందు భాగంగానే రాష్ట్రంలోని విద్యాసంస్థలను మోనిటరింగ్ చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేక వెబ్ సైట్‌ను లాంచ్ చేశారు. www.apsermc.ap.gov.in పేరిట ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌లో స్కూళ్ళు, కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయని.. వాటిని ఆయా స్కూళ్ళు, కాలేజీలు స్వయంగా అప్ లోడ్ చేస్తాయన్నారు.

దీని డొమైన్‌ అందరికీ అందుబాటులో ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. వెబ్‌సైట్‌లో స్కూళ్ళు, కాలేజీలు నమోదు చేసిన వివరాలు ఏవైనా తప్పయితే.. ఎవరైనా సరే విజిల్ బ్లో చేసి వెంటనే సమాచారం అందించాలని సీఎం సూచించారు. విద్యారంగంలో కార్పోరేట్ వ్యవస్థకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న సీఎం జగన్.. అందుకోసం రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటికే వీళ్లు రాష్ట్రంలోని 62 స్కూళ్ళు, 40 కాలేజీలపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. అయితే వాస్తవంగా కేవలం రెండు షెడ్లు, ఒక అడ్మినిస్ర్టేటివ్ భవనం ఉంటే చాలు కాలేజీగా రిజిష్ర్టేషన్ చేయించుకుని, తరగతులు కొనసాగిస్తున్నారు. వీటికి ఆట స్థలాలు సైతం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఒక్కో చోట అంతస్థుల భవనాలలో ఇరుకు, ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి చోట ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే పెద్ధ స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటిపై అధికారులకు పిర్యాదు చేస్తున్నా, కళాశాలల యాజమాన్యాలు వారిని మేనేజ్ చేసి కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వెబ్ సైట్ లో కళాశాలల యాజమాన్యాలు తమ తమ వసతులు నమోదు చేయాల్సి ఉంది. దానిని తప్పుగా నమోదు చేస్తే వాటి నుంచే నేరుగా పిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ పిర్యాదు వెబ్ సైట్ లో ఉన్న వారంతా చూసే అవకాశం ఉండటంతో అధికారులను మేనేజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. దీనిని సక్రమంగా వినియోగిస్తే ప్రైవేటు కళాశాలలలో సైతం ఉత్తమమైన విద్యను అందించేందుకు వీలుంటుంది. ఈ వెబ్సైట్ తో విద్యావిధానంలో సమూలమైన మార్పులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News