Nandyal: నంద్యాలలో రైతుల కంకుల నిరసన గిట్టుబాటు ధర కోసం పోరు!
Nandyal: నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల వినూత్న నిరసన. మొక్కజొన్న జొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మెడలో కంకులు వేసుకుని ఆందోళన చేపట్టారు.
Nandyal: నంద్యాలలో రైతుల కంకుల నిరసన గిట్టుబాటు ధర కోసం పోరు!
నంద్యాల జిల్లా: నంద్యాలలో రైతుల ఆందోళన ఉధృతి.. గిట్టుబాటు ధరల కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన..మొక్కజొన్న కంకులతో వినూత్న నిరసన... పంట నష్టాలకు ఎకరాకు ₹40 వేల పరిహారం డిమాండ్..
నంద్యాల జిల్లాలో రైతుల ఆవేదన రగులుతోంది. కలెక్టర్ కార్యాలయం వేదికగా రైతు సంఘాల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. మొక్కజొన్న, జొన్న, వరి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టారు.
మెడలో మొక్కజొన్న కంకులు వేసుకుని “మా పరిస్థితి చూడండి” అంటూ ప్రభుత్వానికి వినిపించేలా రైతులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కేవలం కాగితాలపైనే మిగిలిపోయాయని, ఇప్పటివరకు రైతులకు ఎలాంటి ప్రయోజనం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధిక వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రతి ఎకరానికి రూ.40 వేల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో పంటలను ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్ పట్టాలు అందించేవారని, ప్రస్తుతం ఒక్కటి కూడా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక జొన్న, మొక్కజొన్న పంటలను ఈ-క్రాప్ నిబంధనలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జొన్నకు రూ.2,400, మొక్కజొన్నకు రూ.3,549 గిట్టుబాటు ధరతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, రైతుల ఓట్లతో గెలిచిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు.
రైతుల ఆందోళనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తుందా? లేదా ఆందోళనలు మరింత ఉధృతమవుతాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.