Anakapalli: కేడీపేట పోలీసుల 'స్పీడ్' ఆపరేషన్ 3 గంటల్లోనే బాలిక సేఫ్
Anakapalli: అనకాపల్లి జిల్లా కేడీపేటలో అదృశ్యమైన బాలికను మూడు గంటల్లోనే పోలీసులు సురక్షితంగా గుర్తించారు.
Anakapalli: కేడీపేట పోలీసుల 'స్పీడ్' ఆపరేషన్ 3 గంటల్లోనే బాలిక సేఫ్
Anakapalli: నర్సీపట్నం రూరల్, ఏప్రిల్ 09: నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని కేడీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం అదృశ్యమైన ఒక బాలికను పోలీసులు అత్యంత వేగంగా స్పందించి సురక్షితంగా గుర్తించారు. కేసు నమోదైన కేవలం మూడు గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టి, తల్లిదండ్రుల చెంతకు చేర్చడం పోలీసుల సమర్థతకు నిదర్శనంగా నిలిచింది.
సంఘటన వివరాలు:
ఈ రోజు ఉదయం సుమారు 8:30 గంటలకు బాలిక మిస్సింగ్ అయినట్లు తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు అందింది.
నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నర్సీపట్నం రూరల్ సి.ఐ. శ్రీమతి రేవతమ్మ పర్యవేక్షణలో కేడీపేట ఎస్సై రిషికేష్ రావు తన సిబ్బందితో కలిసి తక్షణమే రంగంలోకి దిగారు.
ఈ ఆపరేషన్ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసు బృందాలు క్షేత్రస్థాయిలో గాలిస్తూనే, మరోవైపు సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి సమన్వయంతో వ్యవహరించారు. ఈ క్రమంలో బాలిక తూర్పు గోదావరి జిల్లా గండిపేట ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే అక్కడికి చేరుకుని బాలికను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించి, వారికి భరోసా కల్పించారు.
సకాలంలో స్పందించి, చాకచక్యంగా వ్యవహరించి గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన నర్సీపట్నం రూరల్ సి.ఐ. రేవతమ్మను, కేడీపేట ఎస్సై రిషికేష్ రావును మరియు వారి సిబ్బందిని డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
పోలీసుల విజ్ఞప్తి:
"పిల్లలు అదృశ్యమైనా లేదా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ప్రజల అప్రమత్తత మరియు సత్వర సమాచారం కేసుల ఛేదనలో పోలీసులకు మరింత బలాన్నిస్తుంది."