Corona Cases in AP: ఏపీలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి
Corona Cases in AP: ఏపీలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 4 వేలకుపైగా కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Corona Cases in AP: ఏపీలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి
Corona Cases in AP: ఏపీలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 4 వేలకుపైగా కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 30,886 నమూనాలను పరీక్షించగా 4,198 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369కి చేరింది. కరోనా నుంచి ఒక్క రోజులో 9,317 మంది కోలుకోగా ఇప్పటి వరకు 21,94,369 మంది కోలుకున్నారని వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 555 కేసులు, అత్యల్పంగా విజయనగరంలో 54 కేసులు నమోదైనట్లు బులిటెన్ పేర్కొంది. 24 గంటల వ్యవధిలో కరోనాతో చిత్తూరులో ఇద్దరు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు 14,646 మంది మృతి చెందారు.