Jordar Varthalu: ఇదేం రోడ్డురో నాయనా.. చేతితో తీస్తేనే వచ్చేస్తుందిగా

Jordar Varthalu: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో కొత్తగా వేసిన రోడ్డు నాణ్యత అధ్వానంగా ఉంది. కేవలం చేత్తో తీస్తేనే తారు పొరలు ఊడి వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2026-04-11 05:20 GMT

Jordar Varthalu: ఇదేం రోడ్డురో నాయనా.. చేతితో తీస్తేనే వచ్చేస్తుందిగా

Jordar Varthalu: ఓశినీ.. ఇదెక్కడి పర్శాను. శేతితోని పీకుతెనే ఏడికాడికి ఊశొస్తున్నది గద తార్ రోడ్డు. ఆయింత పెద్ద లారో, బస్సో పోతె.. ఈడ డాంబర్ రోడ్డు ఉండేదని చెప్పుకోవాల్శి వస్తదిగావచ్చు పోర్రి. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం మెట్టుచింత కెంచి ఉలిగోగుల నడ్మ ఇర్వై దినాల కింద పోశిర్రట ఈ కొత్త తొవ్వను. ఉత్తుత్తదైతే ఎవ్వలు పట్టిచ్చుకోకపోవు. కనీ., ఆ నడ్మ ఆంధ్రా శిన్న సీఎం కమ్ పవర్ స్టార్ పవనన్న సడక్ల మీద తిర్గి ఫోజులిచ్చిండు గదా. ఆయ్న పాద స్పర్శ తాకినంక తొవ్వెట్లున్నదో సూద్దామని సుట్టుముట్టు ఊరోల్లు అచ్చిపోతున్నరట. తోవ్వేశిన కాంట్రాక్టరు, చెకింగ్లు జేశ్న ఆఫీసర్ల పనితనం సూశి నోరెల్ల వెడ్తున్నరట. పవనన్న కాయిసు పడి పోపిచ్చిన తొవ్వను ఇంత పత్లా ఎట్ల పోశిర్రని పర్శానైతున్నరట. ఇగ పన్లె పనని వీడియోలు తీశి ఇంటర్నెట్ల ఇడ్శిపెడ్తుంటె.. పంకపార్టోల్లు నవ్వుకుంటున్నరట. మా జగనన్న ఏలువడిలనే మంచిగున్నది, తొవ్వ పొయ్యకుంట పైసలు కాపాయం జేశ్నంగనీ., గిట్ల అల్కతక్కో రోడ్లు మాత్రం పొయ్యలేదని మస్తు ప్రౌడుగ ఫీలైతున్నరట పంకపార్టీ ఫ్యాన్సు. బీహార్ అసొంటి రాష్టాల దిక్కు అరుదుగ కానొచ్చే సీన్లు, సీఎం చంద్రన్న ఏలువడిలున్న ఆంధ్రాల సూడాల్శొస్తున్నదని మస్తు గరమైతున్నరట ఓట్లేశి గెల్పిచ్చిన అటుదిక్కు పబ్లిక్కు. మరిది పవనన్న కంట్లె వడ్తె, మంచిగ పోశెదాంక అస్సల్కే ఇడ్శిపెట్టడుగావచ్చు. మరిగ పవనన్నా.. జర్ర మీ ఏలువడిల రోడ్లను ఎంత సక్కదనంగ పోస్తున్నరో సూసుకోవే.. లేకుంటే మీకే నావర్ద అత్తది మరి. అటెంక శెప్పలేదనకుర్రి మరి. ఆ..


Full View


Tags:    

Similar News