HYDRAA: అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. 15 వేల కోట్ల భూమి రికవరీ!
HYDRAA: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ కూల్చివేతలు చేపట్టింది. రూ. 15 వేల కోట్ల విలువైన 860 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఆరు అంతస్తుల భవనం, గెస్ట్ హౌస్‌లను నేలమట్టం చేస్తోంది.
HYDRAA: అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. 15 వేల కోట్ల భూమి రికవరీ!
HYDRAA: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో హైడ్రా (HYDRAA) మరోసారి విరుచుకుపడింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి అక్రమ కట్టడాల కూల్చివేతను ముమ్మరం చేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన భారీ భవనాలను నేలమట్టం చేస్తూ ఆక్రమణదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది.
కోర్టు ఆదేశాలు ఉన్నా బేఖాతర్:
ఐలాపురం గ్రామంలోని సర్వే నంబర్లలో దాదాపు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 1998 నుంచి కోర్టు 'స్టే ఆర్డర్' (Status Quo) ఉన్నప్పటికీ, కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిర్మించిన ఒక విలాసవంతమైన గెస్ట్ హౌస్‌తో పాటు, ఎలాంటి అనుమతులు లేని ఆరు అంతస్తుల భారీ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
రూ. 15 వేల కోట్ల సంపద రక్షణ:
ఈ ఆపరేషన్‌లో హైడ్రా ప్రధానంగా నిరుపేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఐలాపురం తండా మరియు గ్రామంలో ఇప్పటికే వెలిసిన నివాసాలను మినహాయించి, మిగిలి ఉన్న 860 ఎకరాల ఖాళీ భూమిని స్వాధీనం చేసుకుంటోంది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ సుమారు రూ. 15,000 కోట్లకు పైగానే ఉంటుందని అధికారుల అంచనా.
ప్రజా స్పందన:
పేదల ఇళ్లను ముట్టుకోకుండా, కేవలం భారీ కట్టడాలు మరియు ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.