Burning Topic: ఎన్నికల వేళ దీదీ మాస్టర్ ప్లాన్..బీజేపీ కి బిగ్ షాక్?
Burning Topic: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ మమతా బెనర్జీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది! హుమాయున్ కబీర్ తో అసదుద్దీన్ ఒవైసీ పొత్తు ఎందుకు చెడిపోయింది?
Burning Topic: ఎన్నికల వేళ దీదీ మాస్టర్ ప్లాన్..బీజేపీ కి బిగ్ షాక్?
Burning Topic: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్కడి రాజకీయా పార్టీలు హోరా హోరీగా పోరాడుతున్నాయి. 294 స్థానాలు ఉన్న ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్ జనాభాలో దాదాపు 30 శాతం వరకూ ఉండే ముస్లింలు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర & దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో వీరి ప్రభావం ఎక్కువ. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వీరి ఓట్లే అత్యంత కీలకం. రాష్ట్రంలో ఇంతకాలం అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ గెలుపులో ముస్లింల ఓట్లే అత్యంత కీలకమని చెబుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో 35 స్థానాలు 5,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలుపోటములు ప్రభావితం చేశాయి. మరో 70 స్థానాలు 15,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలిచాయి. ఇక్కడ మొత్తం ఓటర్లలో 9 నుంచి 31 మధ్య మైనారిటీ ఓటర్లు ఉన్నారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఎన్నికలకు కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి హుమాయున్ కబీర్‌కు చెందిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈ కూటమి రెండు విభిన్న ముస్లిం ఓటర్ల సమూహాల మధ్య వారధిగా నిలిచేందుకు వేసిన ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా ప్రచారం పొందింది. ఓవైసీ ఉర్దూ మాట్లాడే ముస్లింలపై, కబీర్ బెంగాలీ మాట్లాడే ముస్లింలపై తమ గురి పెట్టారు. ఈ కూటమి ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా కీలకమైన ఓ వర్గంను ఓట్లను చీల్చి రాష్ట్ర ఎన్నికలను ప్రభావం చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం అక్కడి మైనారిటీ ఓట్లను చీల్చడంతో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకు గల్లంతై జేడీయూ, బీజేపీ కూటమి లబ్ది పొందింది. ఇప్పుడు బెంగాల్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని టీఎంసీ ఆందోళనతో ఉంది.
హుమాయున్ కబీర్ మాజీ ఐపీఎస్ అధికారి. టీఎంసీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రిగా పని చేశారు. బీజేపీలో చేరి అక్కడా కొంత కాలం ఉన్నారు. తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. గత ఏడాది ముర్షీదాబాద్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాబ్రీ మసీదు నమునాతో అక్కడ ఓ మసీదు నిర్మిస్తానని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విమర్శల నేపథ్యంలో.. టీఎంసీ ఆయన్ని బహిష్కరించగా ఏజేయూపీ పేరిట కొత్త పార్టీ స్థాపించాడాయన. దీంతో టీఎంసీకి కొంత మేర నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఎంఐఎం, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీల మధ్య పొత్తు కుదరడం మమతా బెనర్జీని ఆందోళనకు గురి చేసింది. ఇదే సమయంలో చోటు చేసుకున్న ఓ పరిణామం టీఎంసీ ఆశలను పెంచింది
తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు రేపింది. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్.. బీజేపీతో చేతులు కలిపి మైనారిటీల ఓట్లను మళ్లించే కుట్ర చేశాడన్నది దీని సారాంశం. ముస్లింలను మోసం చేయడం సులభమని.. ఇందుకు బాబ్రీ మసీదు అంశమే ఉదాహరణ అని హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. ఆ వీడియోలో హుమాయున్ కబీర్.. బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నాడని, మైనారిటీ ఓట్లను మళ్లించేందుకు భారీ నిధులు పొందాడని ఉంది. ఏకంగా ప్రధాని కార్యాలయం ఈ కుట్రలో భాగమైందని.. సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో సమన్వయం చేసుకోవాలని పీఎంవో సూచనలు చేసినట్లు ఉంది.
ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. బెంగాల్ ఓట్లలో ముస్లిం ఓట్లను మళ్లించేందుకు బీజేపీ 1000 కోట్లతో కుట్రకు తెరలేపిందని.. అందులో 200 కోట్లు ముందస్తు నిధులు కబీర్ పొందినట్లు టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. కాగా ఈ ఆరోపణలపై బీజేపీ ఏమాత్రం స్పందించలేదు. అయితే హుమాయున్ కబీర్ ఈ ఆరోపణలను ఖండించారు. తనను కొనడం ఎవరికీ సాధ్యం కాదని వ్యాఖ‌్యానించారు. అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తీసిన వీడియో అని.. 2019 నవంబర్ తర్వాత ఏ బీజేపీ నేతతోనూ తాను టచ్‌లో లేనని స్పష్టం చేశారు. ఇది తృణమూల్ నేతల దుష్ప్రచారమని.. పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు హుమాయున్ కబీర్. కాగా ఈ వీడియో కారణంగా ఎంఐఎం, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీల పొత్తు ప్రమాదంలో పడింది
తాజా వీడియో కలకలం నేపథ్యంలో ఆమ్ జనతా ఉన్నయన్‌తో పొత్తును రద్దు చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.
హుమాయున్ కబీర్ వెల్లడి చేసిన విషయాలు బెంగాల్ ముస్లింలు ఎంత బలహీనంగా ఉన్నారో చూపించాయి. ముస్లింల సమగ్రతను ప్రశ్నించే ఏ ప్రకటనలతోనూ తాము సంబంధం పెట్టుకోబోమని తెలిపారు. కబీర్ పార్టీతో తాము పొత్తును బెంగాల్ ముస్లింలు అత్యంత పేద, నిర్లక్ష్యానికి అణచివేతకు గురైన వర్గాలలో ఒకరు. దశాబ్దాల లౌకిక పాలన , వారి కోసం ఏమీ చేయలేదు. అని వ్యాఖ్యానించారు. మేము బెంగాల్ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తాము ఇకపై ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము అని స్పష్టం చేశారాయన. కొద్దిరోజుల క్రితం అసదుద్దీన్, కబీర్ కలసి ఎన్నికల సభలో పాల్గొన్నారు. తమ పొత్తు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఉంటుందన్నారు. తాజా పరిణామాలతో రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లే.