Off The Record: జాతీయ రాజకీయాల్లో రేవంత్ మార్క్ దేశ్‌కీ నేతగా ఎదుగుతున్నారా..?
Off The Record: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్! కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా కేరళ మరియు తమిళనాడు ఎన్నికల బరిలోకి దింపింది.
Off The Record: జాతీయ రాజకీయాల్లో రేవంత్ మార్క్ దేశ్‌కీ నేతగా ఎదుగుతున్నారా..?
Off The Record: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బలమైన జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నారా..? అంటే అవునే అనాలి. తెలంగాణలో పార్టీకి పెద్ద దిక్కుగా మారడమే కాదు.. వీలు చిక్కినప్పుడల్లా జాతీయ రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఉత్తరాధి, దక్షిణాది అని తేడా లేకుండా..
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా మారారు అయన. మొన్న మహారాష్ట్ర, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. తాజాగా కేరళం, తమిళనాడులోనూ స్టార్ క్యాంపెయినర్‌గా బరిలో దిగారు.
కేరళంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచార సరళి.. నేషనల్ వైడ్‌గా చర్చనీయాంశం అయింది. విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిని రేవంత్ టార్గెట్ చేసిన తీరు.. ఆయన లేవనెత్తిన అంశాలు జాతీయ మీడియాలోనూ హెడ్‌లైన్స్‌గా మారాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై నిప్పులు చెరుగుతూ మోదీ-విజయన్ 'చీకటి ఒప్పందం'పై విమర్శలు చేయడంతో అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకునేలా చేశారు రేవంత్. ఇదే కోవలో తమిళనాడులో సైతం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిచ్చేందుకు సిద్దమయ్యారు. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారనడంలో సందేహం లేదు అంటున్నారు హస్తం వర్గాలు. జాతీయ నేతల కంటే ఎక్కువగా డిల్లీ ప్రయాణాలు, జాతీయ స్థాయిలో పార్టీ తీసుకునే నిర్ణయాల్లో రేవంత్ సూచనలకు ప్రాధాన్యత పెరగడం, హస్తిన పెద్దలతో పరిచయాలు.. ఇవన్నీ AICC భవిష్యత్ కీలక నేతగా ఎదిగేందుకు కనిపిస్తున్న లక్షణాలుగా చెబుతున్నారు.
జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పాత్ర రోజు రోజుకు పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. కేరళం అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు మంచి ఉదాహారణ. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు దొరకని అటెన్షన్ రేవంత్‌కు లభించింది. రేవంత్ విమర్శలపైనే.. ఎక్కువ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను టార్గెట్ చేస్తూ అవినీతిపై ఘాటైన విమర్శలు చేశారు రేవంత్. మోడీ, విజయన్ ఒకటి కాకపోతే.. గోల్డ్ స్కాంలో ఎందుకు సీఎంను విచారించడం లేదని రేవంత్ లేవనెత్తిన అంశం చర్చనీయాంశంగా మారింది. విజయన్ పై రేవంత్ చేసిన బంగారం స్కాం ఆరోపణలు కేరళం ప్రజల సెంటిమెంట్ ఎమోషన్ ను టచ్ చేసి ఆలోచనలో పడేసేలా చేశాడు. రేవంత్ విమర్శలకు కేరళ సీఎం పినరయి విజయన్ సైతం తీవ్రస్థాయిలో స్పందించారు. డైరెక్ట్‌గా రాహుల్ గాంధే.. విజయన్‌ను విమర్శిస్తే అది జాతీయ స్థాయిలో ఇండి కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. దీంతో చాలా తెలివిగా.. రేవంత్‌రెడ్డితో పొలిటికల్ బాణాలు సంధించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు కేరళం,పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. నిన్నటి వరకు కేరళం, పుదుచ్చేరి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఇతర నేతలు ప్రచారం
చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేశారు. మిగతా నేతలకు అసెంబ్లీ స్థానాల వారీగా ఇంఛార్జ్ భాధ్యతలు ఇచ్చారు. దీంతో వారంతా కేరళం ఎన్నికల ప్రచారం ఎండ్ కావడంతో తెలంగాణకు చేరుకున్నారు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను స్టార్ క్యాంపైనర్లుగా నియమించారు. డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీనియర్ అబ్జర్వర్ గాఅధిష్టానం నియమించింది.దీంతో కాంగ్రెస్ నేతలు అంతా తమిళనాడులో మకాం వేసి ప్రచారం చేయనున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో తెలంగాణలో ఏయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్
అమలు చేస్తుందో తమిళనాడు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 28 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం టాస్క్ ఇచ్చింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు.