Jordar Varthalu: టీచర్లకు టార్చ్ బేరర్ ఈమే
Jordar Varthalu: మధ్యప్రదేశ్‌లో ఒక ఉపాధ్యాయిని ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్, ఒక చిన్నారి విద్యార్థితో విసనకర్రతో సేవలు చేయించుకుంటూ ఫోన్లో నిమగ్నమైంది.
Jordar Varthalu: టీచర్లకు టార్చ్ బేరర్ ఈమే
Jordar Varthalu: ఆహా.. ఏం వైభోగం.. ఏం వైభోగం. ఇంతకన్న సుఖం ఈ భూమ్మీద ఏం దొర్కది కావచ్చు పోర్రి. సంటోడు శేతులు నొయ్యంగ విసనకర్ర ఊపుతుంటె.. మేడం నిమ్మలంగ ఫోన్ల చిల్లైతుంది. మధ్యప్రదేశ్ దిక్కు రీవా కాడ గీ పంతులమ్మ, బడిపిలగానితోని ఉక్కపొయ్యకుంట గాలి ఊపిచ్చుకొని దున్యాల ఏ పంతులమ్మ చేపిచ్చుకోని తీర్ల సేవ జేపిచ్చుకుంట కెమ్రాలకు శిక్కింది. టీచర్లంటె పిలగాండ్లకు మంచిబుద్దులు నేర్పాలె, వయ్యిలున్న పాఠాలు జెప్పి ప్రయోజకులను జెయ్యాలె. కనీ., గీమేడం బడిపిలగాండ్లు సేవలు ఎట్ల జెయ్యాల్నో.. పిలగాండ్లతోని సేవలు ఎట్ల జేపిచ్చుకోవాల్నో సభ్యసమాజానికి మెస్సేజ్ పంపుతున్నట్టే కొడ్తుంది గదా. ఎవలో వీడియో తీస్తాంటె.. మంచిగ తియ్యుర్రన్నట్టే, కెమ్రాల దిక్కు ఫేస్ టర్నింగ్ ఇత్తున్నది. ఎవలో ఈ వీడియోను ఇంటర్నెట్ల ఇడ్వంగనే.. మేడం చెప్పిన పాఠాల కంటె ఎక్వ, వైరలైతున్నదిప్పుడు. ఇసొంటోల్లు విద్యాశాఖకు పట్టిన శీడపురుగులనుకుంట కొందరు, ఇసొంటోల్లు జెయ్యవట్టి నిజమైన గురువుల పతార తగ్గుతున్నదనుకుంట ఇంకొందరు కామెంట్లు జేస్తున్నరు.