Jordar Varthalu: కారు ఇవ్వలేదని పీఠల మీది నుంచి వెళ్లిపోయిన పెళ్లికొడుకు
Jordar Varthalu: వరకట్న వేధింపులకు పరాకాష్ట! మహీంద్రా స్కార్పియో కారు ఇవ్వలేదన్న కోపంతో ఒక పెళ్లికొడుకు పెళ్లి పీటల మీద నుంచే లేచి వెళ్ళిపోయాడు.
Jordar Varthalu: కారు ఇవ్వలేదని పీఠల మీది నుంచి వెళ్లిపోయిన పెళ్లికొడుకు
Jordar Varthalu: గీ సీను సూశి సీన్మా షూటింగేమో అనుకోరుల్లో. లే.. పెట్టుపోతలు తగ్గినయని అలిగి అలక పాన్పెక్కిండు గీ మోతెవరి పెండ్లి కొడ్కు. అందుకే కోపంగ ఎన్కకు మర్రి సూడకుంట పోతున్నడున్నట్టు గిట్ల. ఐనా ఈరోజుల్ల ఆడివిల్లను ఇచ్చుడే ఎక్వంటె, ఏం తక్వయిందట ఈ మోతెవరికి అని అంటరా. పిలగానికి కారు గావన్నటుల్ల కారు. అది గుడ మహీంద్రా స్కార్పియో కారు గావన్నట.మహీంద్రా స్కార్పియో కారు పెడ్తమని ముందుగాల్నే ఒప్పుకున్నరో ఏమో తెల్వదిగని, కారు ఇయ్యలేదని.. పిల్ల తర్పునొల్లను కాటు పడగొట్టిండు గిట్ల. గీ ముచ్చట ఏడ జర్గిందో తెల్వదు గని, పిలగాని తలపాగ సూత్తాంటె ఉత్తర భారతదేశం మొకాన జర్గినట్టున్నదుల్ల. కారు ఇయ్యలేదని పెండ్లి పీఠల మీదికెల్లే లేశిండట. అగో ఇదెక్కడి కతరో అని పిల్ల తర్పొల్లు, పెండ్లికచ్చినొల్లంత షాకయ్యిర్రట. అగో ఆ ఎన్కపొయ్యేటొల్లు కొందరు పిల్ల తర్పు సుట్టాలే.. ముంగట పిలగాడు ఉర్కుతాంటె, బతిలాడి పట్టుకద్దామని ఎంబడివడ్డరు. గీ వీడియో సోషల్ మీడియాల మస్తు వైరల్ ఐతాందిప్పుడు. మరి అఖర్కు ఏమైందో గనుల్ల..పెండ్లి పిల్లకయితె మంచి అవకాశం దొరికింది.. గిసోంటోన్ని చేస్కునుడు కంటే పెండ్లి తప్పిపోవుడే మంచిదని కామెంట్లు పెడ్తున్నరు కొందరు. అది గుడ నిజమే గదానుల్ల మరి. ఏమంటరు.