Jordar Varthalu: రోబో తయ్యారు చేసిన బుడ్డోడు.. తగ్గనున్న అటవీశాఖ అధికారుల కష్టం

Jordar Varthalu: తండ్రి పడే కష్టం చూడలేక అటవీ అధికారుల రక్షణ కోసం అద్భుతమైన రోబోను కనిపెట్టాడు ఆసిఫాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి అశ్రిత్.

Update: 2026-04-10 07:35 GMT

Jordar Varthalu: రోబో తయ్యారు చేసిన బుడ్డోడు.. తగ్గనున్న అటవీశాఖ అధికారుల కష్టం

Jordar Varthalu: అపారమైన మేధస్సు ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి. అటవీ శాఖలో డ్రైవర్‌గా పని చేస్తూ, క్రూర మృగాల మధ్య ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తన తండ్రి భద్రత కోసం అశ్రిత్ అనే పదో తరగతి విద్యార్థి ఒక వినూత్న రోబోను ఆవిష్కరించాడు.

కష్టాన్ని చూసి పుట్టిన ఆలోచన:

బెజ్జూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అశ్రిత్ తండ్రి కొండపల్లి సంతోష్ అటవీ శాఖలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. పులులు, ఇతర క్రూర మృగాలు తిరిగే ప్రాంతాల్లో అధికారులు పర్యటించేటప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను అశ్రిత్ గమనించాడు. మనుషుల ప్రాణాలకు ముప్పు లేకుండా జంతువుల జాడను ఎలా పసిగట్టాలనే ఆలోచన నుంచి ఈ రోబో పుట్టింది.


Full View


Tags:    

Similar News