Jordar Varthalu: వామ్మో.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు భయ్యా
Jordar Varthalu: హైదరాబాద్‌లో దోమల సమస్యపై బీజేపీ నేత ఆకుల శ్రీవాణి వినూత్న నిరసన. బెంజ్ కారులో తిరుగుతూ భిక్షాటన చేసి, ఆ డబ్బుతో దోమల తెరలు కొని అధికారులకు చురకలు.
Jordar Varthalu: వామ్మో.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు భయ్యా
Jordar Varthalu: అగో అక్కేంది కొత్త రాగం తీత్తుంది. మచ్చర్ కే నామ్ పే బిచ్చమా. దోమతెరలకు సుతం బిచ్చమేత్తున్నరా ఇయ్యాల్రేపు. కాలానికి తగ్గట్టు నిరసనలు జేసుట్ల అక్క తర్వాతనే ఎవ్వలైనా. వానాకాలంల వర్దల మీద నిరసనలు జెయ్యాల్నన్నా, ఎండాకాలంల దోమల మీద దండయాత్ర జెయ్యాల్నన్నా పువ్వు పార్టీ లీడరక్క ఆకుల శ్రీవాణక్కకు సాటి అచ్చెటోల్లు, పోటీ ఇచ్చెటోల్లు దరిదాపులల్ల గూడ దొర్కరుగావచ్చు పోర్రి. మరి మొన్నట్ల కారు పార్టీ ఎమ్మెల్యే సుధీరన్న దోమలను ఖతం పెట్టే కొత్త ఫ్యాశన్ను బైటవెడ్డిండు గదా. గట్ల జేస్తే అన్నను కాపీ కొట్టినట్టైతదనుకున్నదో ఎట్లనో.. అట్ల గాకుంట వైరీటీగ, దోమతెర డ్రెస్సును కొనెతందుకు బిచ్చమెత్తే ఆలోచన జేశింది శ్రీవాణక్క. పట్నం సరూర్ నగర్ల గల్లీ గల్లీ తిరిగి శిల్లరడుక్కున్నది. అటెంక బెంజ్ కార్ల పొయ్యి అచ్చిన పైసల్తోని మచ్చర్ దాన్ కొన్నది. ఆన్నుంచి సీదా మల్కాజ్ గిరి మున్సిపల్ ఆఫీసుకు పొయ్యి జిట్టి బొమ్మకు దోమతెర తల్గిచ్చింది. మరి ఈన్నే, గా జిట్టి బొమ్మను ఎందుకు వెట్టిందో అక్క జెప్తదట ఇనుర్రి.
దోమలతోని పట్నం పబ్లిక్ పర్శానైతున్నా, సర్కారోల్లకు శెవ్వున పేనుపారినట్టు సుతం అయితలేదు. గల్లీలల్ల పొగ గొడ్తలేరు, మోరీలల్ల దోమలను సంపే మందులు సల్లుతలేరని ఈ తీర్ల గళమెత్తింది శ్రీవాణక్క. దోమలు కుట్టి రోగాలపాలైతున్నా, సర్కారు కండ్లు తెర్తలేదని గరమైంది. ఇట్ల గల్మ ముంగట కడ్తెనన్న కనవడి పనులు జేస్తరని ఈ ఆలోశన జేశిందట. కనీ., పట్నంల పువ్వు పార్టీ ఏలువడిలకచ్చెదాంక అక్కకు ఈ తిప్పలైతే తప్పెతట్టు లేదు పోర్రి. ఈముచ్చటను శ్రీవాణక్క ఇంటర్నెట్ల ఇడ్వంగనే.. బెంజ్ కార్ల పొయ్యి కాస్లీగ అడుక్కునుడేందని కొందరు పర్శానైతుంటే.. సొంత పైసలు పెట్టి, పనులు జేపిస్తె ఏమైతదని ప్రశ్నలెయ్యవట్టిర్రు ఇంకొందరు అటు దిక్కు జనాలు. ఏమాటకామాటనే కని, ఇచ్చంత్రాల నిరసనలు జేసుట్ల అక్క తర్వాతనే ఎవ్వలైనా పోండ్రి.