Off The Record: అజార్ మంత్రి పదవికి చిక్కులు.. ఈ నెలాఖరే డెడ్ లైన్

Off The Record: తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవికి గడువు సమీపిస్తోంది. ఏప్రిల్ 30 లోపు ఆయన చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది.

Update: 2026-04-08 01:43 GMT

Off The Record: అజార్ మంత్రి పదవికి చిక్కులు.. ఈ నెలాఖరే డెడ్ లైన్

Off The Record: అజారుద్దీన్‌ మంత్రి పదవికి.. డెడ్‌లైన్ వచ్చి పడింది. మంత్రిగా కొనసాగడమా లేక ఉద్వాసన పలకడమా..? ఇందులో ఏదో ఒకటి తేల్చువాల్సిన అనివార్యత ఏర్పడింది. మరి అజారుద్దీన్‌ మంత్రిగా కంటీన్యూ అవ్వాలంటే ఆయన ముందున్న దారులు ఏంటి..? ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి ఆలోచనతో ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వివాదం ఇప్పట్లో తెలేనా..? అది కాకుండా ఎమ్మెల్సీగా అజార్దున్‌ ఎంపికకు ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా..? అజారుద్దీన్ ఈ గండాన్ని గట్టెక్కుతారా లేక ఆర్నెళ్ల మంత్రిగానే మిగిలిపోతారా..?

మంత్రి అజారుద్దీన్‌కు.. ఏప్రిల్ 30వ తారీఖు టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా కొనసాగుతారా లేదా అని డిసైడ్ చేసే డెడ్‌లైన్ అది. అజారుద్దీన్ మంత్రిగా ఎన్నికై ఆ రోజుకి ఆర్నెళ్లు పూర్తి అవుతుంది. దీంతో ఆ లోపు శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురి అవుతారు. దీంతో ఇదే అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది..? ఆయన్ను ఎమ్మెల్సీగా నిలబెట్టే మార్గాలు ఏంటి..? అనే ఆసక్తి నెలకొంది. అసలే ఆయన హైకమాండ్ రికమెండ్ పర్సన్, పైగా ముస్లిం మైనార్టీ నుంచి కేబినెట్‌లో ఉన్న ఏకైక మంత్రి. దీంతో పార్టీ ఏం చేస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

క్రికెట్ ప్రేమికుల్లో అజారుద్దీన్ పేరు తెలియని వారు ఉండరు అంటే నమ్మరు. అయితే క్రికెట్ లో ఎంత రాణించినా ఆయన చివరకు ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ వీడాల్సి వచ్చింది. క్రికెట్ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో బాగంగా రాజకీయాల్లోకి వచ్చారు. తరువాత యూపీ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు. కానీ ఆ తర్వాత ఆయనకు మరోసారి గెలుపు దరిచేరలేదు. తన పొలిటికల్ ఫోకస్‌ను తెలంగాణకు షిఫ్ట్‌ చేసుకున్నాక..గత అసెంబ్లీ ఎన్నిక టైంలో జూబ్లీహిల్స్ బరిలో నిలిచారు. కానీ మాగంటిపై ఓడిపోయారు. ఐతే గోపీనాథ్ మరణంతో.. అక్కడి ఉప ఎన్నిక రాగా.. ఆయనకు కలిసి వచ్చింది. పొలిటికల్ ఈక్వేషన్స్‌లో భాగంగా..ఆయనకు ఎఐసిసి మంత్రి పదవి కట్టబెట్టింది.

కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాంకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఇద్దరి విషయంలో ఒకరు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, మరొకరు క్రికెట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోవడం ఇలా ఇద్దరి ఎమ్మెల్సీ పదవులపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. మంత్రివర్గంలో మైనార్టీలు మంత్రిగా లేరని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం మరొక వైపు జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హడావుడిగా అజారుద్దీన్ ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.

అక్టోబర్ 31 వ తేదీన మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అప్పటికి తాను ఎమ్మెల్సీగా గానీ,, ఎమ్మెల్యేగా గానీ లేరు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపు ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీగానే ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే ఈ నెలఖరుతో 6 నెలల గడువు ముగుస్తుంది. ఈ గడువు ముగిసే లోపు ఆయనకి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాలి. గవర్నర్ కోటాలో ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే కవిత రాజీనామాతో నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగాల్సి ఉంది. ఇలా రెండు ఆప్షన్ లు ఆయన ముందు ఉన్నాయి. అయితే గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌ను గవర్నర్ తిరస్కరించారు. ఇక నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఖాళీగా ఉన్నా అక్కడ mptcలు జడ్పీటీసీలు లేకపోవడంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు..

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ పదవులు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమిర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హాయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయబడ్డ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమిర్ అలీ ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి.. మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండటంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో..ఆ సమయంలో అజారుద్దీన్ ను మంత్రిగా నియమించారు. దీంతో ఆయన ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి అనివార్యత ఏర్పడింది.

ఇప్పటికే కోదండరాం, అజారుద్దీన్ ల ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నదని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆ విధంగా కాకపోతే మరోసారి మంత్రివర్గం అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటాలో సిఫార్సు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే గవర్నర్‌ కోటా ఎంపికకు రాష్ట్ర కేబినెట్ మళ్లీ తీర్మానాన్నిచేస్తుందా? లేక గతంలో కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఎంపిక చేస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించమని గవర్నర్ ను ప్రభుత్వం కోరుతుందా? అనే అంశం ఇప్పుడు కీలకంగా ఉంది. ఈ నెల 30 లోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తేలిస్తే.. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వ్యవహారంలో గవర్నర్ నిర్ణయమే అత్యంత కీలకంగా మారింది. మొత్తానికి అజారుద్దీన్ మంత్రిపదవి వ్యవహారం ఈ నెలలోనే తేల్చాల్సిన అవసరం అయితే ఉంది.

చూడాలి మరి ఇటు ప్రభుత్వ పెద్దలు.. అటు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..


Full View


Tags:    

Similar News