Burning Topic: సీఎం పదవికి నితీశ్ రాజీనామా.. బిహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో?
Burning Topic: బీహార్ రాజకీయాల్లో పెను మార్పు. ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.
Burning Topic: సీఎం పదవికి నితీశ్ రాజీనామా.. బిహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో?
Burning Topic: బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నితీశ్ కుమార్, తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యసభకు నితీశ్.. ఎమ్మెల్సీ పదవికి స్వస్తి:
నితీశ్ కుమార్ ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంట్‌లోనూ, ఇటు రాష్ట్ర శాసనసభలోనూ సభ్యుడిగా ఉండకూడదు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ (MLC) పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు. ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ముఖ్యమంత్రి పదవికి ఆయన అధికారికంగా రాజీనామా సమర్పించనున్నారు.