Burning Topic: శాంతి అంటూనే.. ఇరాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇజ్రాయెల్

Burning Topic: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు. 10 నిమిషాల్లో 100 ప్రాంతాలపై బాంబుల వర్షం. ప్రతికారంగా హర్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.

Update: 2026-04-10 07:10 GMT

Burning Topic: శాంతి అంటూనే.. ఇరాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇజ్రాయెల్

Burning Topic: పశ్చిమాసియాలో దాదాపు నెల రోజులకు పైగా కొనసాగతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెర పడింది. ఇరాన్ నాగరికత అనేది పూర్తిగా లేకుండా చేస్తానని హుంకరించిన అమెరికా అ‍ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు. యుద్ధానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. దాదాపు 40 రోజులుగా కొనసాగిన తర్వాత ఇరాన్- అమెరికాలు మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి.

ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళికను అమెరికా చర్చల ప్రాతిపదికగా అంగీకరిచిన ట్రంప్.. దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తన ట్రూత్ ద్వారా ప్రకటించారు. రెండు వారాల పాటు సైనిక చర్యలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో దీర్ఘకాలిక శాంతి ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఇకవేళ 14 రోజుల్లో ఒప్పందం కుదరకుంటే మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. తాజా పరిణామం యావత్ ప్రపంచానికి పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.


Full View


Tags:    

Similar News