Armoor: బస్టాండ్‌లో హైడ్రామా.. 10 మందిపై కేసు నమోదు
Armoor: ఆర్మూర్ పెర్కిట్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులో సీటు వివాదం నేపథ్యంలో ఒక యువకుడిపై 10 మంది కలిసి దాడి చేశారు.
Armoor: బస్టాండ్‌లో హైడ్రామా.. 10 మందిపై కేసు నమోదు
ఆర్మూర్ న్యూస్: పట్టణ పెర్కిట్ బస్టాండ్ లోకి వచ్చిన ఆర్టీసీ బస్సును ఆపి, ఒక యువకుడ్ని కొట్టిన ఒక వర్గం చెందిన పది మందిపై కేసు సీఐ నమోదు చేసింది తెలిసింది, విషయానికొస్తే ఇటు వలే మూడు రోజుల క్రితం నిర్మల్ నుంచి నిజాంబాద్ వైపు వెళ్తున్న బస్సు లో ఓ యువకులు సీట్ కోసం కర్చీఫ్ వేశారు, బస్సులో ఎక్కిన తర్వాత కర్చీఫ్ వేసిన సీట్లు వేరే వ్యక్తి కూర్చోడంతో , సీటు విషయం ఇద్దరు మాట్లాడుకుని , ఒకటై పక్క పక్కన కూర్చున్నారు, అయితే మూడో వ్యక్తి కర్చీఫ్ వేసిన వ్యక్తిని ఎందుకు సీటుపై కూర్చో పెట్టావని, చెప్పి తన వర్గానికి చెందిన సెల్ ఫోన్లో చెప్పాడు,
బస్టాండ్ కు బస్సు రాగానే వంటనే ఓ వర్గానికి చెందిన పదిమంది కలిసి బస్సులో లోపలికి వెళ్లి కర్చిప్ వేసి సీటు కోసం కూర్చున్న యువకుడి పై దాడి చేశారు, బస్సులో ఉన్న మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దురుసుగా మాట్లాడారు, పెర్కిట్ వద్ద బస్సును ఆపడం, కొడుతున్న దృశ్యాలు, సంఘటన వీడియో సెల్ ఫోన్లలో వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యాయి, వాట్సాప్ గ్రూప్ లో వీడియో వైరల్ అయిన ఆధారంగా బాధితుడు ఫిర్యాదు మేరకు సిఐ సత్యనారాయణ గౌడ్ విచారణ జరిపి, బస్సులు ఆపి కొట్టిన పదిమంది వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేశారు, ఈ పదిమందిని స్టేషన్కు పిలిచి విచారణ జరిపి, వాస్తమని నిద్దరించుకున్నా పోలీసులు కేసు నమోదు చేశారు.