Jukkal: ప్రజల గోడు విన్న సర్పంచ్.. త్రాగునీటి సమస్యకు చెక్!

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం ఆరో వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కారమైంది.

Update: 2026-03-27 08:37 GMT

Jukkal: ప్రజల గోడు విన్న సర్పంచ్.. త్రాగునీటి సమస్యకు చెక్!

Jukkal: జుక్కల్ (కామారెడ్డి) మండల నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్ మండల కేంద్రం లోని ఆరో వార్డులోని కాలని వసూలు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య పై స్పందించిన గ్రామ సర్పంచ్ కర్రెవర్. సావిత్రి సాయగౌడ్ ఆ కాలనిలో గల నూతన బోరు బావిలో నూతన బోరు మోటార్ బిగించి నీటి సమస్య పరిష్కారం చేసినందుకు ఆ కాలని వసూలు హర్షం వ్యక్తం చేశారు.

తమ కాలనిలో నెలకొన్న నీటి సమస్య పై పలుమార్లు గత పాలకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎ ఒక్కరు పట్టించుకోకపోవడంతోపాటు సమస్య పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇటీవల కాలని వసూలు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన కార్యదర్శి సర్పంచ్ సహకారం తో కాలని వసూల నీటి సమస్య ను పరిష్కరించడం తో తమ సమస్య తీరినట్లు ఆ కాలని వసూలు పేర్కొన్నారు.

పాల్గొన్న నాయకులు, అధికారులు..

జుక్కల్ మండల కేంద్రం లోని ఆరో వార్డులో నివాసముంటున్న కాలని వసూల సౌకర్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్ బిగించిన కార్యక్రమం లో జుక్కల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ కె. సాయగౌడ్, వార్డు సభ్యులు చంద్రకళ, లక్ష్మణ్, గ్రామ పెద్దలు భూమయ్య తోపాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News