Kamareddy: వైభవంగా పట్టువస్త్రాల సమర్పణ.. శ్రీరామనవమి కోలాహలం!
Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణం గాంధీ చౌక్ రామాలయంలో శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Kamareddy: వైభవంగా పట్టువస్త్రాల సమర్పణ.. శ్రీరామనవమి కోలాహలం!
Kamareddy: బిచ్కుంద (కామారెడ్డి) బిచ్కుంద పట్టణం గాంధీ చౌక్ లో ప్రసిద్ధి గాంచిన శ్రీ రామాలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ రాములోరి జన్మోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధ లతో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ సెట్కార్ రమేష్ కుటుంబ సభ్యుల తో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ ఆలయ రాములోరికి ప్రతి యేట ధర్మ జాగరణ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తుంది.
ముందుగ బిచ్కుంద పట్టణం లోగల హనుమాన్ మందిరము నుండి బాజా భజంత్రీలతో ప్రధాన వీధుల గుండా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి శ్రీ రాములోరి కి సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. బలరాముడి నామకరణ అనంతరం శ్రీ రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పాల్గొన్న భక్తులు, నాయకులు..
శ్రీ రాములోరి జన్మోత్సవ వేడుకల సందర్భంగా పి సి సి డెలిగేట్. విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాహేల్ సెట్కార్, ప్రముఖ వ్యాపార వేత్త కోలవార్.కుమార్ సెట్, ప్రేమ్ సెట్, మైపత్ హన్మండ్లు, నాగరాజ్, దత్తు పంతులు, ధర్మ జాగరణ ప్రముక్. డాక్టర్. నర్సింలు, రచ్చ. శివకాంత్, గణేష్ గోండ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.