Armoor: విశ్వగురువుగా భారత్.. హిందూ సమ్మేళనానికి కదలి రండి!

Armoor: ఆర్మూర్ పెర్కిట్ కుక్కల గుట్ట శ్రీ వెంకటేశ్వర మందిరంలో భారీ హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు.

Update: 2026-03-27 07:59 GMT

Armoor: విశ్వగురువుగా భారత్.. హిందూ సమ్మేళనానికి కదలి రండి!

ఆర్మూర్ న్యూస్: పెర్కిట్ లోని కుక్కల గుట్ట శ్రీ వెంకటేశ్వర మందిర ప్రాంగణములో "హిందూ సమ్మేళనం" కార్యక్రమం నిర్వహించిడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి నిర్వహణ కమిటీ అధ్యక్షులుగా బెన్నాజీ రాజేశ్వర్ బాధ్యత వహిస్తూ.ముఖ్యఅతిథిగా ఆధ్యాత్మిక గురువు, విశ్వసమాజం, శ్రీ వీర ధర్మజ పీఠం హైదరాబాద్ శ్రీశ్రీశ్రీ విశ్వ బ్రహ్మశ్రీ పూజ వీరధర్మజ స్వామీజీ ,

ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత ప్రచారక్, తెలంగాణ శ్రీ కల్పగురి ప్రభుకుమార్ ,వక్త గా ఆచార్యులు, సేవికాసమితి నిజామాబాద్ శ్రీమతి శుభ దేశ్ పాండే విచ్చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ అధ్యక్షులు బెన్నాజి రాజేశ్వర్, సభ్యులు క్యాతం బాపురెడ్డి, జక్కుల శ్రీధర్, గటడి అంజలి, జనార్ధన్ నాగమణి మాట్లాడుతూ.

ఈ కార్యక్రమానికి ఆత్మీయ హైందవ సోదర సోదరీమణులారా ఆత్మ, ప్రాణం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం ఇటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రండి! కదలి రండి! దేశ రక్షణ కొరకు, ధర్మ రక్షణ కొరకు సంస్కృతి రక్షణ కొరకు భారతమాత సేవలో ప్రతిజ్ఞ భూని ఈ మహత్కార్యం లో హిందూ బంధువులందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మెనం ఏర్పాటు చేయడం జరిగిందని. కావున సమస్త హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని హిందూ ఐక్యతను, సమరసతను చాటవలసిందిగా ఈ సందర్భంగా వారు కోరుతూ ప్రతి హిందూ కుటుంబాన్ని ఆహ్వానించడమైనది.

ఈ కార్యక్రమంలో జెస్సు అనిల్ కుమార్, డాకూరి ప్రవీణ్, గంగరాజుల నర్సయ్య, ఖండోబా ప్రవీణ్ జీవి గంగారాం, ఎలిషాల గంగాధర్ రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్సై, రాపెల్లి రవి, గుజేటి రాము, దాచేపల్లి శ్రీనివాస్, భూమేశ్వర్, సుంకం రవి, ధర్మపురి విజయ, సులోచన బెన్నాజి, పసుపుల అరుంధతి, సులోచన తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News