Odela: ఓదెలలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

Odela: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది.

Update: 2026-03-27 07:32 GMT

Odela: ఓదెలలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

ఓదెల: పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కళ్యాణ వేడుకల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు.

పట్టువస్త్రాల సమర్పణ:

కళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సతీమణి చింతకుంట పావని గారు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి (EO) సదయ్య, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్యలతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.

Tags:    

Similar News