Karimnagar: సేవలో ముందున్న జైపాల్ అన్న మిత్రమండలి భక్తులకు ప్రసాద వితరణ
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్ గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Karimnagar: సేవలో ముందున్న జైపాల్ అన్న మిత్రమండలి భక్తులకు ప్రసాద వితరణ
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్ గ్రామాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
శ్రీరాముల కళ్యాణాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులకు సదుపాయాలు కల్పిస్తూ, కొత్త జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జైపాల్ అన్న మిత్రమండలి సభ్యులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు చేపట్టారు. పులి వేర పదార్థాన్ని పంపిణీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ సేవా కార్యక్రమం భక్తుల్లో ఆనందాన్ని నింపగా, మిత్రమండలి సభ్యుల సేవా భావాన్ని స్థానికులు అభినందించారు. శ్రీరామనవమి ఉత్సవాలు భక్తి, సేవా కార్యక్రమాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.