Nandipet: తూ..తూ.. మంత్రంగా తనిఖీలు అధికారుల తీరుపై విమర్శలు!
Nandipet: నందిపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారులు 10 కిరాణా షాపులపై జరిమానా విధించారు.
Nandipet: తూ..తూ.. మంత్రంగా తనిఖీలు అధికారుల తీరుపై విమర్శలు!
నందిపేట్ న్యూస్: జిల్లా మండల కేంద్రంలో తూనికలు కొలతల అధికారులు కిరాణా షాపులలో తనిఖీలు చేసి ప్యాక్ చేసిన వస్తువులపై జరిమానా విధించారు. ఈ సందర్భంగా తూనికల కొలతల అధికారి మాట్లాడుతూ నందిపేట మండల కేంద్రంలో బుధవారం 10 కిరాణా షాపులపై తనిఖీలు చేయడం జరిగిందని.
తూనికలు కొలతల పైన ముద్ర వేయించుకోని షాపులలో, అలాగే ప్యాకెడ్ ఐటమ్ల పైన తనిఖీ చేయగా 10 షాపులలోప్యాకెడ్ ఐటమ్ల ను గుర్తించామని, వారికి జరిమానా కూడా విధించడం జరిగిందని తెలిపారు. కానీ మండల కేంద్రంలో తూనికలు కొలతల అధికారులు తూ..తూ..మంత్రంగా అందుబాటులో ఉన్న చిన్న చిన్న కిరణా షాపులపై తనిఖీలు చేసి జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు.
పెద్ద పెద్ద షాపింగ్ మాళ్ళను, రకరకాల ఎన్నో దుకాణాలను వదిలేస్తున్నారని, వారంత సంతలల్లో కూడా రకరకాల వస్తువులను ప్యాకేజీ రూపంలో ఎటువంటి ఎమ్మార్పీ తారీఫ్లు లేకుండా, నాణ్యతలేని వస్తువులను విక్రయాలు చేస్తున్నా, వారిపై చర్యలు తీసుకోవడం లేదని, అధికారులు పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.