Vatapalem: వేటపాలెం బిసి గురుకుల పాఠశాలలో సదా భార్గవి ఆకస్మిక తనిఖీ!

Vatapalem: వేటపాలెం బిసి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన నేషనల్ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి. మెరుగైన విద్య, పేరెంట్స్ మీటింగ్స్‌పై కీలక ఆదేశాలు.

Update: 2026-08-20 01:49 GMT

Vatapalem: వేటపాలెం బిసి గురుకుల పాఠశాలలో సదా భార్గవి ఆకస్మిక తనిఖీ!

Vatapalem: మెరుగైన విద్యాబోధనకు తరచూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని నేషనల్ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి అన్నారు. బుధవారం స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించాలని సూచించారు. పదవ తరగతి అనుమతులు గత సంవత్సరంలోనే వచ్చినప్పటికీ మంచి ఫలితాలు సాధించడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఇంకా మంచి ప్రతిభ చూపేందుకు సమిష్టి కృషి అవసరమన్నారు. 500 మంది విద్యార్థులకు సరిపడా పాఠశాలలో ఏర్పాటులు ఉన్నాయని, 150 మంది విద్యార్థులకు నాలుగు టాయిలెట్లు, నాలుగు బాత్రూములు, ఆ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, దార్మిటరీ కూడా మంజూరు చేయడం జరిగిందని, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతుందని, విద్యార్థులు వంట పనుల్లో భాగస్వామ్యం కాకుండా అదనంగా వంట మనుషులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

అందరూ సమిష్టి కృషితో మరింత మెరుగైన విద్యాబాధన చేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఒక నెలలో ఇంకా మెరుగైన విద్యాబోధన నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. విధులలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు, పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించేందుకు విద్యార్థులను భాగస్వాములు చేసి వారికి మానసిక వికాసం పెంపొందించేందుకు తోడ్పడాలని సూచించారు. ప్రస్తుతం 10వ తరగతిలో 23 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని , వచ్చే సంవత్సరానికి 40 మంది ఉండేవిధంగా కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ప్రతినిధి దేవరకొండ రాంబాబు ఆదివాసీ సంక్షేమ సంఘం ప్రతినిధి కే సురేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ ప్రతినిధి కె వి ప్రసాద్, పాఠశాల ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News