Chirala: బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం ఎమ్మెల్యే మాలకొండయ్య
Chirala: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కొనియాడారు.
Chirala: బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం ఎమ్మెల్యే మాలకొండయ్య
Chirala: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ:- ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారతకు ఈ నిర్ణయం బలమైన పునాది అని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే చిరకాల ఆకాంక్షను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ వర్గాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ యువత, బీసీ మహిళలకు రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు రాజకీయంగా వెనుకబడిన, అణగారిన బీసీ కులాలకు నాయకత్వ అవకాశాలు కల్పించి, వారిని రాజకీయంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే టీడీపీ లక్ష్యమన్నారు.
రాబోయే స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
“బీసీ యువత ఎదగాలి.. బీసీ మహిళలు నాయకత్వం వహించాలి.. అణగారిన బీసీ కులాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం దక్కాలి. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా పాలనలో భాగస్వాములుగా, నాయకులుగా తీర్చిదిద్దడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం” అని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు.
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ గారు ప్రారంభించిన సామాజిక న్యాయ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.
“ఎన్టీఆర్ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు. ఆయన చూపిన బాటలోనే చంద్రబాబు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు” అని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఒక వైపు.. సంక్షేమం మరో వైపు అనే విధంగా ప్రజల భవిష్యత్తే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. అమరావతి అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, పరిశ్రమలు–పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు పేదలు, మహిళలు, రైతులు, యువత, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేవలం ఎన్నికల రిజర్వేషన్ కాదు బీసీల రాజకీయ సాధికారతకు, స్థానిక పాలనలో వారి భాగస్వామ్యానికి బలమైన పునాది అని ఎమ్మెల్యే మాల కొండయ్య పేర్కొన్నారు.
మాకు అధికారం ఒక అలంకారం కాదు ప్రజల పట్ల ఒక బాధ్యత. ఎన్టీఆర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేస్తాం, బీసీ యువత, మహిళలు రాజకీయంగా ఎదగడానికి, అణగారిన బీసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని ఎమ్మెల్యే మాల కొండయ్య స్పష్టం చేశారు.