Markapur: వెలిగొండ పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలి

Markapur: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశం.

Update: 2026-08-18 16:11 GMT

Markapur: వెలిగొండ పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలి

మార్కాపూర్: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులతో కలిసి వివిధ పునరావాస లే-అవుట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మార్కాపురం మండలంలోని వేములకోట, ఇడుపూర్-1, ఇడుపూర్-2, గోగులదిన్నె, పెద్దారవీడు మండలంలోని తోకపల్లి, దేవరాజుగట్టు పునరావాస కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు. తాగునీరు, రహదారులు, విద్యుదీకరణ, డ్రైనేజీ, అంతర్గత రహదారులు తదితర పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.

నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్దేశిత గడువులోగా అన్ని మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారులు, డ్రైనేజీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పునరావాస కాలనీల్లో మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పునరావాస పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ తనిఖీలలో ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News