Veligonda: వెలిగొండ నిర్వాసితులకు నేడు రూ.200 కోట్ల పరిహారం!

Veligonda: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఈనెల 24లోపు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ. నేడు 1,600 కుటుంబాలకు రూ.200 కోట్ల పరిహారం అందించనున్న సీఎం చంద్రబాబు.

Update: 2026-08-19 06:13 GMT

Veligonda: వెలిగొండ నిర్వాసితులకు నేడు రూ.200 కోట్ల పరిహారం!

Veligonda: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఈనెల 24వ తేదీలోపు అర్హులైన నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పరిహారం చెల్లింపులు పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నేడు 1,600 కుటుంబాలకు రూ.200 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు.

ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని 2,565 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన కుటుంబాలకు కూడా నిర్ణీత గడువులోగా ప్యాకేజీ మొత్తాలను అందించేలా చర్యలు చేపట్టింది.

మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ నెలాఖరుకు నల్లమల్లసాగర్‌కు వెలిగొండ నీటిని తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిర్వాసితుల ప్యాకేజీ చెల్లింపులతో పాటు ప్రాజెక్టు నీటి తరలింపు అంశం కూడా కీలకంగా మారింది.

Tags:    

Similar News