Giddalur: ఇమామ్‌లు, మౌజన్ల పెండింగ్ వేతనాలు వెంటనే మంజూరు చేయాలి!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరులోని బిలాల్ మసీదులో ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంక్షేమ సంఘం సమావేశం జరిగింది.

Update: 2026-08-20 10:40 GMT

Giddalur: ఇమామ్‌లు, మౌజన్ల పెండింగ్ వేతనాలు వెంటనే మంజూరు చేయాలి!

గిద్దలూరు: ఈరోజు గిద్దలూరు పట్టణంలోని బిలాల్ మజీద్ ఆవరణలో ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుడిసె మహబూబ్ బాషా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహబూబ్ బాషా మాట్లాడుతూ మసీదులలో పనిచేయుచున్న ఇమామ్ మరియు మౌజనుల వేతనాల కొరకు కొత్తగా దరఖాస్తులు చేసుకొని ఎనిమిది సంవత్సరములు ఆయన కూడా ఇంతవరకు ఆ మసీదులలో పనిచేయుచున్న ఇమామ్ మరియు మౌజనుల వేతనాలు ఇంతవరకు మంజూరు చేయలేదు.

ముఖ్యమంత్రివర్యులు వెంటనే స్పందించి ఆదాయము లేని మసీదులలో పనిచేయుచున్న ఇమామ్ మరియు మౌజోన్ల వేతనాలను వెంటనే మంజూరు చేసి ముస్లిం మైనారిటీ ప్రజలను ఆదుకోవాలని కోరారు అలాగే పలు స్మశాన వాటికల్లో ప్రహరీ గోడలు లేక సమాధులను బర్రెలు పందులు వివిధ రకాలైన జంతువులు తిరుగుతూ సమాధులను అపవిత్రం చేస్తున్నందున సమాధుల కాంపౌండ్ వాల్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ చాంద్. పి సయ్యద్ పీరా ఖాన్, బాషా, మహమ్మద్ రఫీ, షేక్ గఫూర్ అలీ, జబ్బార్ అలీ, ఖాసింపీరా, దాదా పీరా, డి దస్తగిరి ,ఎం పుల్లయ్య, షేక్ ఖాజా మసీదు పెద్దలు పాల్గొన్నారు.

Tags:    

Similar News