Markapur: మార్కాపురంలో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

Markapur: మార్కాపురం గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన నాయకుడు డాక్టర్ షేక్ మహబూబ్ వలి.

Update: 2026-08-19 11:56 GMT

Markapur: మార్కాపురంలో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

మార్కాపూర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహబూబ్ వలి మాట్లాడుతూ.. సద్భావన, శాంతి, సమైక్యతే రాజీవ్ గాంధీ ఆశయాలని, ఆయన జయంతిని సద్భావన దివస్‌గా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో కంప్యూటర్, టెలికాం, ఐటీ రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ పునాది వేశారని, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు.

అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, తర్లుపాడు మండల అధ్యక్షుడు షేక్ హుస్సేన్, నాయకులు పాతర్ల ఇసాక్, సామ్యూల్, అబ్రహం, పఠాన్ రసూల్ ఖాన్, షేక్ అబ్దుల్ రెహమాన్, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News