Markapuram: దోర్నాల హైస్కూల్‌లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు!
Markapuram: మార్కాపురం జిల్లా దోర్నాల ప్రభుత్వ పాఠశాలలో ఏపీశాక్స్ దిశా కార్యక్రమం ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ నివారణ, అవగాహన సదస్సు నిర్వహించారు.
Markapuram: దోర్నాల హైస్కూల్‌లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు!
మార్కాపురం: మార్కాపురం జిల్లా దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో దిశా కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.ఎస్. ప్రసన్న అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అవగాహన కార్యకర్త పసుపులేటి రేణుకాదేవి మాట్లాడుతూ హెచ్‌ఐవీ అంటే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ అని, హెచ్‌ఐవీ ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వివరించారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత సూదులు లేదా పరికరాల వినియోగం, హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించడం, హెచ్‌ఐవీ సోకిన తల్లి నుంచి బిడ్డకు వంటి మార్గాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే లైంగిక వ్యాధుల లక్షణాలు, అవి కంటికి కనిపించే మరియు కనిపించని లక్షణాలుగా ఉండే అవకాశం ఉందని వివరించారు. హెచ్‌ఐవీ చట్టం–2017, టోల్‌ఫ్రీ నంబర్ 9017పై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.ఎస్. ప్రసన్న, అవగాహన కార్యకర్త పసుపులేటి రేణుకాదేవి, పి. భవాని, మల్లీశ్వరి, పాఠశాల సిబ్బంది, బాలబాలికలు పాల్గొన్నారు.