Nellore: పెయ్యలపాలెం ప్రజల ఆర్తనాదం.. అధికారులారా మా ప్రాణాలు కాపాడండి!
Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెంలో రిలయన్స్ బయో ఎనర్జీ ఫ్యాక్టరీ వల్ల వాయు కాలుష్యం పెరిగిందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
Nellore: పెయ్యలపాలెం ప్రజల ఆర్తనాదం.. అధికారులారా మా ప్రాణాలు కాపాడండి!
Nellore: కొడవలూరు మండలం పెయ్యలపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన రిలయన్స్ బయో ఎనర్జీ ఫ్యాక్టరీని తక్షణమే ఆపివేయాలని పెయ్యలపాలెం గ్రామస్తులు కోరారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో వస్తున్నటువంటి వాయువుల వల్ల గ్రామంలో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని గ్రామస్తులు అన్నారు. రిలయన్స్ బయో ఫ్యాక్టరీలో నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల భరించలేని దుర్వాసన వస్తుందని ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో అసలు ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యాలు క్షీణించి హాస్పిటల్ బారిన పడుతున్నామని లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడటం లేదని అన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని పై అధికారులు జోక్యం చేసుకొని ఫ్యాక్టరీని ఇక్కడ నుండి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, పినాక సుభాష్ రెడ్డి, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.