Palakonda: పాలకొండలో ఏపీ జెఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఏపీ జెఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక! చైర్మన్‌గా పైల ఈశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక.
Palakonda: పాలకొండలో ఏపీ జెఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం!
పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ ఏపీ జెఎసి చైర్మన్ గా ఏపీ ఎన్జీ జీవో సంఘ అధ్యక్షులు పైల ఈశ్వరరావు స్థానిక ఎన్జీవో కార్యాలయం నందు ఏపీఎన్జీ జీవో జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ శ్రీ ఎస్ భాస్కరరావు ఎస్ టి ఓ గారి పర్యవేక్షణలో జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీ కే రంగాచారి గారి ముఖ్య అతిథిగా సీనియర్ కామ్రేడ్ శ్రీ ఈ లిల్లీ పుష్పనాదం ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల మరియు కార్మికుల ఐక్యవేదిక ఏర్పాటు చేయడమైనది. జేఏసీ చైర్మన్ గా పైల ఈశ్వరరావు. గౌరవ అధ్యక్షులుగా లిల్లీ పుష్ప నాదం ఉపాధ్యక్షులుగా ఎన్ఎంయు నుంచి వి రాజేష్ కుమార్ పి ఆర్ టి యు నుంచి బి విజయలక్ష్మి ఏపీటీఎఫ్ నుంచి శాసపు వాసుదేవరావు రెవిన్యూ నుంచి ప్రధాన కార్యదర్శిగా జే రమేష్ కుమార్ రెవిన్యూ నుంచి సంయుక్త కార్యదర్శిగా ఎస్ చిట్టిబాబు ఎస్టీయూ నుంచి కే కాంతారావు యుటిఎఫ్ నుంచి కే ఆనందరావు కోశాధికారిగా ఖజానా శాఖ నుంచి టి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు పాల్గొనడం జరిగింది ఈ నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ జివిఆర్ కిషోర్ గారు రంగాచారి గారు అభినందించారు.