Ichapuram: ఇచ్ఛాపురంలో క్రికెట్ ఫీవర్.. అండర్-19 పోటీలు షురూ!

Ichapuram: ఇచ్ఛాపురం తోటవీధిలో జీవైసీసీ ఆధ్వర్యంలో చిదంబరేశ్వర అండర్-19 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.

Update: 2026-03-28 02:29 GMT

Ichapuram: ఇచ్ఛాపురంలో క్రికెట్ ఫీవర్.. అండర్-19 పోటీలు షురూ!

Ichapuram: ఇచ్ఛాపురం పట్టణంలోని తోటవీధిలో చిదంబరేశ్వర అండర్ - 19 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను జీవైసీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ కౌన్సిలర్లు కాళ్ల దిలీప్, కాళ్ల జైదేవ్, ప్రముఖ వైద్యుడు ఉలాల శేషు, సాలీన గాంధీ, సప్ప నితీష్ హాజరయ్యారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, ఆరోగ్యంగా ఉంటారని కాళ్ల దిలీప్ అన్నారు. ఈ కార్యక్రమంలో జీవైసీసీ సభ్యులు, నిర్వహకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News