Srinivasa Varma: ఆకివీడు బాధితులకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పరామర్శ

Srinivasa Varma: ఆకివీడు ఘర్షణలో గాయపడిన బాధితులను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ భీమవరం ఆసుపత్రిలో పరామర్శించారు.

Update: 2026-03-28 04:00 GMT

Srinivasa Varma: ఆకివీడు బాధితులకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పరామర్శ

Srinivasa Varma: ఆకివీడు ఘర్షణలో గాయపడి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పరామర్శించారు.​శుక్రవారం ఆకివీడు ఘటన లో గాయపడిన గవర అనిల్ కుమార్, వెజ్జు నాగ సాయిలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, జనసేన నాయకులు చలమలశెట్టి చంద్రశేఖర్, బండి రమేష్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, లీలా కృష్ణ, షేక్ మొహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News