Viral : పానీపూరి అమ్మితే అంత వస్తుందా? నెలకు రూ. 90 వేల సంపాదనతో సాఫ్ట్‌వేర్ వాళ్లకే షాక్

Viral : రోడ్డు పక్కన పానీపూరి అమ్మే వ్యక్తి నెలకు రూ.90 వేల వరకు సంపాదిస్తున్నాడనే వార్త వైరల్ అవుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే వీరే ఎక్కువ సంపాదిస్తున్నారని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Update: 2026-03-28 06:13 GMT

Street Food Income

Viral : సాధారణంగా రోడ్డు పక్కన బండి మీద పానీపూరి అమ్మే వ్యక్తిని చూస్తే.. "పాపం, రోజుకు ఎంత సంపాదిస్తాడో ఏమో!" అని జాలిపడుతుంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా తమ ఉద్యోగాల గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక మామూలు పానీపూరి వాలా నెలకు సంపాదించే ఆదాయం వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

పానీపూరి వాలా సంపాదన లెక్కలివే

ప్రస్తుతం సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ కేసీ పెరీరా షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను ఆలోచనలో పడేసింది. ఈ వీడియోలో ఒక సాధారణ పానీపూరి విక్రేత తన రోజువారీ సంపాదన గురించి వివరించాడు. అతను రోజుకు సగటున 100 ప్లేట్ల పానీపూరి అమ్ముతాడట. ఒక్కో ప్లేట్ ధర రూ.30 చొప్పున లెక్కగడితే, రోజుకు రూ.3,000 ఆదాయం వస్తుంది. అంటే నెలకు సుమారు రూ.90,000 వరకు సంపాదిస్తున్నాడన్నమాట. విశేషమేమిటంటే, అతను ఈ సంపాదన కోసం పడుతున్న కష్టం కేవలం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే కేవలం 6 గంటలు మాత్రమే

సోషల్ మీడియాలో నెటిజన్ల గోల

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు తమ బాధను కామెంట్స్ రూపంలో వెళ్లగక్కుతున్నారు. "నేను చదువుకున్న చదువుకి వస్తున్న శాలరీ కంటే, ఈ పానీపూరి మామ ఇన్కమ్ ఎక్కువగా ఉంది" అని ఒక యూజర్ వాపోయాడు. మరికొందరు "వీళ్లు అసలు ఇన్కమ్ టాక్స్ కూడా కట్టరు, మొత్తం వైట్ మనీయే.. నిజమైన ఎంజాయ్‌మెంట్ అంటే వీళ్లదే!" అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. బి.కాం డిగ్రీ పట్టుకుని తిరుగుతున్న వారికంటే, బండి పెట్టుకున్న వారే ఎక్కువ సంపాదిస్తున్నారని మరికొందరు తలలు పట్టుకుంటున్నారు.

ఖర్చుల సంగతేంటి?

అయితే, ఈ రూ. 90 వేలు మొత్తం లాభమేనా అంటే కాదంటున్నారు నిపుణులు. ఇందులో పెట్టుబడి కూడా ఉంటుంది. పూరీలు, ఆలూ మసాలా, నీళ్ల కోసం వాడే మసాలాలు, గ్యాస్, బండి అద్దె ఇవన్నీ తీసేయాలి. కొంతమంది విశ్లేషకుల ప్రకారం.. ఈ రూ.90 వేల అమ్మకాల్లో సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నికర లాభం ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక సామాన్య మధ్యతరగతి ఉద్యోగి కంటే, ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ గౌరవప్రదమైన సంపాదన కలిగి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

బిజినెస్ ఏదైనా.. ప్లాన్ ముఖ్యం

చాలామందికి చిన్న చూపుగా అనిపించే పానీపూరి వ్యాపారంలో ఇంత ఆదాయం ఉందని తెలియడంతో, ప్రస్తుతం చాలామంది యువత కూడా ఇలాంటి సరికొత్త స్ట్రీట్ ఫుడ్ స్టార్టప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం చదువు మాత్రమే కాదు, కస్టమర్లను ఆకట్టుకునే రుచి, శుభ్రత ఉంటే ఏ వ్యాపారమైనా కాసుల వర్షం కురిపిస్తుందని ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది. అందుకే ఈసారి పానీపూరి తినేటప్పుడు, ఆ బండి వెనుక ఉన్న సంపాదనను చూసి మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం.

Tags:    

Similar News