Viral Video : గ్యాస్ అక్కర్లేదు.. గిన్నెల అవసరం లేదు.. జ్యామెట్రీ బాక్స్‌లో అదిరిపోయే పాస్తా.. నెటిజన్లు ఫిదా
Viral Video : ఒక వ్యక్తి జ్యామెట్రీ బాక్స్‌లో పాస్తా వండి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Geometry Box Pasta
Viral Video : సోషల్ మీడియాలో వింతలకు కొదువ లేదు. ఒకప్పుడు స్టూడెంట్స్ తమ స్కేళ్లు, పెన్సిళ్లు, కంపాస్ బాక్సులను దాచుకునే జ్యామెట్రీ బాక్స్‌ను.. ఇప్పుడు ఒక వ్యక్తి ఏకంగా కిచెన్‌లా మార్చేశాడు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా, ఇది నిజం. ఈ మధ్య కాలంలో మినియేచర్ కుకింగ్ అంటే బొమ్మరిల్లు వంటలు చాలా ఫేమస్ అయ్యాయి కానీ, జ్యుమెట్రీ బాక్స్‌లో పాస్తా చేయడం మాత్రం నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. సాధారణంగా విద్యార్థులు జ్యామెట్రీ బాక్స్‌ను లెక్కలు చేయడానికి, పెన్సిళ్లు దాచుకోవడానికి వాడతారు. కానీ ఈ ప్రయోగాత్మక వీరుడు ఆ బాక్స్‌ను ఒక చిన్న స్టౌలా మార్చేశాడు. ముందుగా ఆ బాక్సులో నీళ్లు పోసి, ఒక చిన్న మంట సాయంతో పాస్తాను ఉడికించాడు. ఆ తర్వాత అదే బాక్సులో కొద్దిగా నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు వేసి మంచి సాస్ తయారు చేశాడు. ఇదంతా చూస్తుంటే ఏదో చిన్న బొమ్మరిల్లు వంటలా అనిపించినా, ఆ వ్యక్తి చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పాస్తా సాస్ రెడీ అయిన తర్వాత, ఉడికించిన పాస్తాను అందులో కలిపి కాసేపు మగ్గనిచ్చాడు. చివరకు తయారైన డిష్ చూస్తే, ఏ హోటల్‌లోనో ఆర్డర్ చేసిన పాస్తాలాగే కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వారు "ఇది కదా అసలైన క్రియేటివిటీ" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఈ రోజుల్లో కొత్తగా ఏదైనా చేసి వైరల్ అవ్వాలనే తపనతో జనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జ్యామెట్రీ బాక్స్ వంట కూడా ఆ కోవలోకే వస్తుంది.
ఈ వీడియోను కొందరు వినోదంగా తీసుకుంటుంటే, మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జ్యామెట్రీ బాక్స్‌లు మెటల్‌తో తయారవుతాయి, వాటిపై ఉండే పెయింట్ లేదా కెమికల్స్ వంట చేసేటప్పుడు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, మనిషి ఆలోచనకు పరిధులు లేవని, సాధారణ వస్తువులతో కూడా అసాధారణ విషయాలు చేయొచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.