Eluru: ఐస్‌క్రీమ్ అమ్మితే రూ. 3వేల ఫైన్.. ఏలూరు జిల్లా నెమలిపేట గ్రామస్తుల సంచలన నిర్ణయం!

Eluru: పిల్లల ఆరోగ్యం కోసం ఏలూరు జిల్లా నెమలిపేట గ్రామస్తులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మకాలు, కొనుగోళ్లపై పూర్తిస్థాయి నిషేధం విధించారు.

Update: 2026-04-01 05:39 GMT

Eluru: ఐస్‌క్రీమ్ అమ్మితే రూ. 3వేల ఫైన్.. ఏలూరు జిల్లా నెమలిపేట గ్రామస్తుల సంచలన నిర్ణయం!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని నెమలిపేట గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మకాలపై గ్రామస్తులు నిషేధం విధించారు. గ్రామ పరిసరాల్లో ఐస్ క్రీమ్ అమ్మిన, కొనుగోలు చేసిన వారికీ జరిమానా విధించబడనని బ్యానర్లు సైతం గ్రామ సరిహద్దుల్లో ఏర్పాటు విశేషం. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

గ్రామ పరిసరాల్లోకి ఐస్‌క్రీమ్ అమ్మితే ఐస్ క్రీమ్ బండ్లకు రూ.3000 జరిమానా , అలానే కొన్నవారికి కూడా రూ.1000 జరిమానా విధిస్తామని స్పష్టంగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని కేవలం మాటల్లోనే కాకుండా అమలు చేయాలని ఉద్దేశంతో గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News