Headache: పరీక్షలన్నీ నార్మల్ వచ్చినా తలనొప్పి తగ్గడం లేదా.? అసలు కారణం ఇదే కావొచ్చు
Headache: నెల్లూరు కార్పొరేషన్‌లో మొక్కల పెంపకంపై అవినీతి జరిగిందన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఖండించారు.
Headache: పరీక్షలన్నీ నార్మల్ వచ్చినా తలనొప్పి తగ్గడం లేదా.? అసలు కారణం ఇదే కావొచ్చు
Headache: తలనొప్పి సర్వసాధారణమైన సమస్య. అయితే ఈ సమస్య ఎక్కువైతేనే ఇబ్బంది. మరి ఎంత మంది వైద్యులను సంప్రదించినా, ఎన్ని రకాల పరీక్షలు చేయించినా నార్మల్ వచ్చినా తలనొప్పి తగ్గకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణుల మాట ప్రకారం ఇది చాలా సందర్భాల్లో పెద్ద వ్యాధి సంకేతం కాదు. ఎక్కువగా మన రోజువారీ అలవాట్లు, జీవనశైలి కారణంగానే ఇలా జరుగుతుంది. శరీరంలో పెద్ద సమస్య లేకపోయినా, జీవన విధానంలో ఉన్న చిన్న చిన్న తప్పులు తలనొప్పిగా బయటపడుతాయి. ఇప్పుడు రిపోర్టులు నార్మల్ అయినా తలనొప్పి ఎందుకు వస్తుంది? దానికి కారణాలు ఏమిటి? వాటిని ఎలా తగ్గించుకోవాలి? అన్న విషయాలు తెలుసుకుందాం.
ఒత్తిడి (Stress) – తలనొప్పికి ప్రధాన కారణం
ఇప్పటి వేగమైన జీవనశైలిలో ఒత్తిడి చాలా సాధారణమైంది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల మనం మానసికంగా టెన్షన్‌లో ఉంటాం. ఇలా ఎక్కువ రోజులు ఒత్తిడిలో ఉంటే తలతో పాటు మెడ కండరాలు గట్టిపడతాయి. దాంతో తల చుట్టూ బిగుసుకుపోయినట్టు అనిపించే తలనొప్పి వస్తుంది. దీనిని టెన్షన్ హెడ్‌ఏక్ అని అంటారు. ఇది చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య.
తప్పుగా కూర్చునే విధానం
ప్రస్తుతం కాలంలో మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగం చాలా పెరిగింది. చాలాసార్లు మనం వంగి కూర్చుని గంటల పాటు ఫోన్ లేదా కంప్యూటర్ చూస్తూ ఉంటాం. ఇలా ఎక్కువసేపు వంగి కూర్చోవడం వల్ల మెడ, భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తలకు చేరి తలనొప్పికి కారణమవుతుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేసే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువసేపు స్క్రీన్ చూడటం
మొబైల్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్‌లను గంటల పాటు చూస్తే కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. స్క్రీన్ చూస్తున్నప్పుడు మనం తక్కువసార్లు మాత్రమే కళ్లను మూసి తెరుస్తాం. దీనివల్ల కళ్లలో అలసట, పొడిబారటం జరుగుతుంది. ఈ అలసట క్రమంగా తలనొప్పిగా మారుతుంది. దీన్ని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా అంటారు.
సమయానికి ఆహారం తినకపోవడం
కొంతమంది పని బిజీ కారణంగా భోజనం ఆలస్యంగా చేస్తారు లేదా ఒక టైమ్ మిస్ అవుతారు. ఇలా ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోతే రక్తంలో షుగర్ స్థాయి తగ్గుతుంది. దీంతో బలహీనత, చిరాకు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే రోజుకు సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
నిద్ర సరిపోకపోవడం
మన మెదడు ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది. సరైన నిద్ర లేకపోతే శరీరం పూర్తిగా విశ్రాంతి పొందదు. తక్కువ నిద్ర, మధ్యలో నిద్ర భంగం కావడం లేదా చాలా ఎక్కువగా నిద్రపోవడం కూడా తలనొప్పిని పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం వంటి అలవాట్లు పెట్టుకోవాలి.
తలనొప్పి తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి?
రిపోర్టులు నార్మల్ ఉన్నా వచ్చే తలనొప్పిని చాలాసార్లు మందులు లేకుండానే నియంత్రించవచ్చు. రోజంతా సరిపడా నీరు తాగాలి. స్వల్ప డీహైడ్రేషన్ కూడా తలనొప్పికి కారణమవుతుంది. సరైన విధంగా కూర్చోవాలి, స్క్రీన్ కళ్ల స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30–40 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. రోజుకు మూడు లేదా నాలుగు సార్లు సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ 7–8 గంటలు నిద్రపోవాలి. ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా చాలా మందికి తరచూ వచ్చే తలనొప్పి తగ్గిపోతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు వైద్యుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు డాక్టర్ల సూచనలు పాటించడమే మంచిది.