Health: త‌ర‌చుగా ఆవ‌లింత‌లు వ‌స్తున్నాయా.? ఇది ఏ వ్యాధికి సంకేత‌మో తెలుసా.

Health: ఆవలింతలు రావడం చాలా సాధారణం. ఎక్కువగా నిద్రలేమి, అలసట వల్లే వస్తాయని చాలా మంది భావించి పెద్దగా పట్టించుకోరు. కానీ త‌ర‌చుగా ఆవ‌లింత‌లు వ‌స్తుంటే మాత్రం అల‌ర్ట్ అవ్వాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Update: 2026-04-07 09:46 GMT

Health

Health: ఆవలింతలు రావడం చాలా సాధారణం. ఎక్కువగా నిద్రలేమి, అలసట వల్లే వస్తాయని చాలా మంది భావించి పెద్దగా పట్టించుకోరు. కానీ త‌ర‌చుగా ఆవ‌లింత‌లు వ‌స్తుంటే మాత్రం అల‌ర్ట్ అవ్వాల‌ని నిపుణులు చెబుతున్నారు.

మెదడు సమస్యలతో సంబంధం ఉండొచ్చు

ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా వరుసగా ఆవ‌లింత‌లు వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. క్లినికల్ పరిశోధనల ప్రకారం ఎక్కువగా ఆవ‌లింత‌లు రావడం కొన్ని న్యూరాలజికల్ సమస్యలతో సంబంధం ఉండొచ్చు. ఉదాహరణకు మూర్ఛ (ఎపిలెప్సీ), స్ట్రోక్ లేదా మెదడులో గాయాలు వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు. కొన్ని కేసుల్లో వరుసగా ఆవ‌లింత‌లు రావడం “ఫ్రంటల్ లోబ్ సీజ్‌ర్” అనే మెదడు సమస్యలో భాగంగా కనిపించిందని పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల సాధారణంగా కనిపించే ఈ లక్షణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.

ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ప్రభావం

ఆవ‌లింత‌ల‌కు మన శరీరంలోని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్‌తో కూడా సంబంధం ఉంటుంది. ఈ వ్యవస్థ గుండె స్పందనలు, రక్తపోటు, జీర్ణక్రియ వంటి మనకు తెలియకుండా జరిగే శరీర క్రియలను నియంత్రిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఎక్కువగా ఆవ‌లింత‌లు రావడం ఈ వ్యవస్థలో అసమతుల్యతకు సంకేతంగా ఉండొచ్చు. మైక్రోన్యూరోగ్రఫీ అనే పరీక్షల ద్వారా ఆవ‌లింత‌లు వచ్చే సమయంలో నరాలకు సంబంధించిన కొన్ని సంకేతాలు తాత్కాలికంగా తగ్గిపోతాయని గుర్తించారు. దీని వల్ల శరీరంలో ప్యారాసింపథెటిక్ యాక్టివిటీ పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మ‌రో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆవ‌లింత‌లు మెదడు ఉష్ణోగ్రత నియంత్రణతో కూడా సంబంధం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆవ‌లింత‌ల‌ ద్వారా చల్లని గాలి లోపలికి వెళ్లి రక్తప్రసరణను పెంచుతుంది. స్ట్రోక్ వచ్చిన కొంతమంది రోగుల్లో మెదడు ఉష్ణోగ్రతను నియంత్రించే భాగాలు ప్రభావితమైనప్పుడు ఎక్కువగా ఆవ‌లింత‌లు కనిపించాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

డోపమిన్ అసమతుల్యత కూడా కారణం కావచ్చు

ఆవ‌లింత‌లపై మెదడులో ఉండే రసాయనాల ప్రభావం కూడా ఉంటుంది. JAMA నెట్‌వర్క్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఆవ‌లింత‌లు “డోపమిన్” అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌తో సంబంధం కలిగి ఉంటాయి. ఈ డోపమిన్ మన మూడ్, ఉత్సాహం, కదలికలను నియంత్రించే ముఖ్యమైన రసాయనం. శరీరంలో డోపమిన్ స్థాయిలు అసమతుల్యంగా ఉన్నప్పుడు కూడా తరచుగా ఆవ‌లింత‌లు రావచ్చు. అయితే ప్రతి సారి ఆవ‌లింత‌ రావడం ప్రమాద సంకేతం అని భావించాల్సిన అవసరం లేదు. నిద్రలేమి, ఎక్కువ పని, అలసట వంటి సాధారణ కారణాల వల్ల కూడా కార‌ణాలువుతాయి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు వైద్యుల సూచ‌న‌ల‌కు ప్ర‌త్యామ్నాయం కాద‌ని గుర్తించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల స‌ల‌హాలు పాటించ‌డ‌మే మంచిది.

Tags:    

Similar News