Health: ఎండ‌కాలంలో ముక్కు నుంచి ర‌క్తం ఎందుకు వ‌స్తుంది.? రాకుండా ఏం చేయాలి.?

Health: స‌మ్మ‌ర్‌లో కొంతమందికి అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం వ‌స్తుంది. వైద్య భాషలో దీనిని ఎపిస్టాక్సిస్ (Epistaxis) అంటారు. ఎక్కువ వేడి, పొడి గాలి, శరీరంలో నీటి లోపం వంటి కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుంది.

Update: 2026-04-01 07:02 GMT

Health: ఎండ‌కాలంలో ముక్కు నుంచి ర‌క్తం ఎందుకు వ‌స్తుంది.? రాకుండా ఏం చేయాలి.?

Health: స‌మ్మ‌ర్‌లో కొంతమందికి అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం వ‌స్తుంది. వైద్య భాషలో దీనిని ఎపిస్టాక్సిస్ (Epistaxis) అంటారు. ఎక్కువ వేడి, పొడి గాలి, శరీరంలో నీటి లోపం వంటి కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. ఇంత‌కీ స‌మ‌స్య ఎందుకు వ‌స్తుంది.? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముక్కు నుంచి రక్తం ఎందుకు వస్తుంది?

ముక్కు లోపలి పొర చాలా పలుచగా ఉంటుంది. ఎండ‌ కాలంలో ఈ పొర ఎండిపోతుంది. అలాంటి సమయంలో తుమ్మడం, ముక్కును రుద్దినా రక్తం రావచ్చు. వీటితో పాటు అలర్జీ సమస్యలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులో వేళ్లు పెట్టడం, ముక్కుకు గాయం కావడం, రక్తాన్ని పలుచగా చేసే మందులు తీసుకోవడం. కొన్ని సందర్భాల్లో హై బ్లడ్ ప్రెషర్, రక్తం గడ్డకట్టే సమస్యలు లేదా ముక్కు నిర్మాణ సమస్యలు కూడా కారణం కావచ్చు.

ముక్కు నుంచి రక్తం వస్తే వెంటనే ఏం చేయాలి.?

ముక్కు నుంచి రక్తం వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా ప్రశాంతంగా ఉండాలి. వెంట‌నే

నిటారుగా కూర్చోవాలి, తలను కొంచెం ముందుకు వంచాలి. ముక్కు నెమ్మదిగా పట్టుకుని 10–15 నిమిషాలు ఒత్తి పట్టుకోవాలి. నోటితో శ్వాస తీసుకోవాలి. ముక్కు లేదా నుదుటిపై చల్లటి గుడ్డ లేదా ఐస్ పెట్టాలి. ఈ చర్యలు తీసుకుంటే చాలా సందర్భాల్లో కొద్ది నిమిషాల్లోనే రక్తస్రావం ఆగిపోతుంది.

ముక్కు నుంచి రక్తం వచ్చినప్పుడు చేయకూడని పనులు

కొంతమంది భయంతో తప్పు చర్యలు తీసుకుంటారు. అవి సమస్యను మరింత పెంచుతాయి. ఈ ప‌రిస్థితుల్లో

తలను వెనక్కి వంచకండి, వెంటనే పడుకోకండి, ముక్కు మళ్లీ మళ్లీ తెరిచి చూసుకోవద్దు, ముక్కులో పత్తి లేదా టిష్యూ గట్టిగా నొక్కకండి, ఇవి రక్తం గొంతులోకి వెళ్లే ప్రమాదాన్ని పెంచుతాయి.

ముక్కు నుంచి రక్తం రావడం తగ్గేందుకు ఇంటి చిట్కాలు

ఈ సమస్య తరచుగా వస్తే కొన్ని సులభమైన ఇంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముక్కు లోపల పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరి నూనె కొద్దిగా రాయాలి. గదిలో హ్యూమిడిఫైయర్ ఉపయోగిస్తే గాలి తేమగా ఉంటుంది. రోజూ సరిపడా నీరు తాగాలి. స్టీమ్ తీసుకుంటే ముక్కు లోపల తేమ నిలుస్తుంది. ఈ చిన్న అలవాట్లు ముక్కు ఎండిపోకుండా కాపాడుతాయి.

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

సాధారణంగా ముక్కు నుంచి వచ్చే రక్తం పెద్ద సమస్య కాదు. అయితే కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. 20 నిమిషాలకన్నా ఎక్కువసేపు రక్తం ఆగకపోతే, తరచూ ముక్కు నుంచి రక్తం వస్తుంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఎక్కువగా రక్తస్రావం అయితే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్ష చేయించుకోవడం మంచిది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన వివ‌రాల‌ను వైద్యుల సూచ‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా భావించ‌కూడ‌దు. ఆరోగ్యానికి సంబంధించినంత వ‌ర‌కు నేరుగా వైద్యుల‌ను క‌లిసి వారి సూచ‌న‌లు పాటించ‌డ‌మే మంచిది.

Tags:    

Similar News