Feet Health: పాదాల్లో మంటగా, తిమ్మిరిగా ఉంటోందా.? ఈ వ్యాధి సంకేతం కావొచ్చు.
Feet Health: చాలా మందికి పాదాల్లో మంట, జలదరింపుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో దీనిని అలసట లేదా చిన్న సమస్యగా భావించి పట్టించుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది శరీరంలో జరుగుతున్న పెద్ద ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
Feet Health: పాదాల్లో మంటగా, తిమ్మిరిగా ఉంటోందా.? ఈ వ్యాధి సంకేతం కావొచ్చు.
Feet Health: చాలా మందికి పాదాల్లో మంట, జలదరింపుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో దీనిని అలసట లేదా చిన్న సమస్యగా భావించి పట్టించుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది శరీరంలో జరుగుతున్న పెద్ద ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. అందుకే పాదాల్లో మంట లేదా తిమ్మిరి తరచూ వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అవసరం.
పెరిఫెరల్ న్యూరోపతి (Peripheral Neuropathy) ప్రధాన కారణం
పాదాల్లో మంట, తిమ్మిర వచ్చే ప్రధాన కారణాల్లో ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి. ఇది నరాలకు సంబంధించిన సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు పాదాల్లో మంట, తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవడం లాంటివి కనిపిస్తాయి. ఈ సమస్య ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువకాలం పెరిగి ఉంటే నరాలు దెబ్బతింటాయి. దాంతో పాదాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
సయాటికా (Sciatica) సమస్య కూడా కారణం కావచ్చు
పాదాల్లో మంటకు మరో కారణం సయాటికా. ఇది వెన్నెముక నుంచి వచ్చే సయాటిక్ నర్వ్ పై ఒత్తిడి పడటం వల్ల ఏర్పడే సమస్య. ఈ నర్వ్ శరీరంలో అత్యంత పొడవైన నరంగా ఉంటుంది. దీనిపై ఒత్తిడి పడితే వెన్ను నొప్పి, కాళ్లలో నొప్పి, మంట, తిమ్మిరి లాంటివి పాదాల వరకు చేరుతాయి.
ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, తప్పుడు భంగిమలో కూర్చోవడం, బరువైన వస్తువులు ఎత్తడం వంటి సమయాల్లో ఈ సమస్య వస్తుంది.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (Restless Legs Syndrome)
కొంతమందికి రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనే సమస్య ఉంటుంది. ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పాదాల్లో అసహజమైన అనుభూతి కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారికి పాదాల్లో మంట, తిమ్మిరి, కాళ్లు కదిలించాలని అనిపించడం, అసహనం లాంటివి అనిపిస్తాయి. ఈ సమస్య ఎక్కువగా రాత్రి సమయంలో కనిపిస్తుంది. దాంతో నిద్ర కూడా సరిగా పట్టదు.
విటమిన్ B12 లోపం కూడా ఒక కారణం
శరీరంలో కొన్ని విటమిన్లు తక్కువగా ఉన్నా కూడా పాదాల్లో మంట, తిమ్మిరి రావచ్చు. ముఖ్యంగా విటమిన్ B12 లోపం ఉంటే నరాలకు నష్టం కలుగుతుంది. దీంతో చేతుల్లో, పాదాల్లో మంట, తిమ్మిరిగా అనిపిస్తుంది. పోషకాహారం తక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, అసమతుల ఆహారపు అలవాట్లు వంటివి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అందుకే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం.
కిడ్నీ, థైరాయిడ్ సమస్యలు కూడా కారణం కావచ్చు
కొన్ని సందర్భాల్లో కిడ్నీ సమస్యలు లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా పాదాల్లో మంట, తిమ్మిరి కనిపించవచ్చు. శరీరంలో టాక్సిన్లు పెరిగితే అవి నరాలపై ప్రభావం చూపుతాయి. దాంతో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి, రోజూ వ్యాయామం చేయాలి, సమతుల ఆహారం తీసుకోవాలి, తగినంత నీరు తాగాలి, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవద్దు, మధ్య మధ్యలో స్ట్రెచింగ్ చేయాలి.
గమనిక: పాదాల్లో మంట, తిమ్మిరి ఎక్కువకాలం కొనసాగితే లేదా నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించాలి. సరైన సమయంలో పరీక్షలు చేయించుకుంటే సమస్యను త్వరగా నియంత్రించుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో సొంత చికిత్సలు పనికి రావని గుర్తించాలి.