HPV వ్యాక్సిన్ అంటే ఏమిటి? ఇది మహిళల జీవితాన్ని ఎలా కాపాడుతుంది?
HPV Vaccine: మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలేంటీ క్యాన్సర్.? ఎలా వస్తుంది.? ఈ వ్యాక్సిన్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
HPV వ్యాక్సిన్ అంటే ఏమిటి? ఇది మహిళల జీవితాన్ని ఎలా కాపాడుతుంది?
HPV Vaccine: మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలేంటీ క్యాన్సర్.? ఎలా వస్తుంది.? ఈ వ్యాక్సిన్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
HPV వ్యాక్సిన్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
HPV వ్యాక్సిన్ అనేది ఒక ప్రత్యేక టీకా. ఇది శరీరాన్ని HPV వైరస్ నుంచి రక్షిస్తుంది. ఈ వ్యాక్సిన్‌లో అసలు వైరస్ ఉండదు. వైరస్‌లా కనిపించే ప్రోటీన్‌ను శరీరంలోకి పంపుతుంది. దాంతో మన శరీరం దానిని ప్రమాదకరంగా గుర్తించి యాంటీబాడీలు తయారు చేస్తుంది. తరువాత నిజమైన HPV వైరస్ శరీరంలోకి వచ్చినప్పుడు, ఈ యాంటీబాడీలు వెంటనే దానిని నాశనం చేస్తాయి. దాంతో ఇన్ఫెక్షన్ రావడం తగ్గుతుంది, క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
HPV వైరస్ అంటే ఏమిటి?
HPV ఒక సాధారణ వైరస్. ఇది చర్మంతో పాటు జననేంద్రియ భాగాలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా రకాల HPV వైరస్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. చాలా సార్లు లక్షణాలు లేకుండా శరీరంలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది సర్వైకల్ క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్, అనల్ క్యాన్సర్, గొంతు లేదా నోటి క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారి తీస్తుంది.
HPV వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన సరైన వయస్సు
HPV వ్యాక్సిన్ తీసుకోవడానికి సరైన సమయం చాలా ముఖ్యం. 9 నుంచి 14 సంవత్సరాలు అత్యుత్తమ వయస్సుగా చెబుతారు. ఈ సమయంలో శరీరం మంచి రోగనిరోధక శక్తిని చూపుతుంది. చిన్న వయస్సులో వేయించుకుంటే మంచి రక్షణ లభిస్తుంది. 26 సంవత్సరాల వరకు కూడా వేయించుకోవచ్చు. పురుషులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 45 సంవత్సరాల తర్వాత సాధారణంగా ఇవ్వరు
ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు
సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ:
ఇది మహిళల్లో ప్రాణాపాయం కలిగించే ప్రధాన క్యాన్సర్. వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
ఇతర క్యాన్సర్ల నుంచి రక్షణ:
HPV వల్ల వచ్చే అనల్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్ వంటి వాటి నుంచి రక్షణ పొందొచ్చు.
ఇన్ఫెక్షన్ వ్యాప్తి తగ్గింపు:
వ్యాక్సిన్ తీసుకున్నవారు వైరస్‌ను ఇతరులకు పంపే అవకాశం తక్కువ.
హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి?
సమాజంలో ఎక్కువ మంది HPV వ్యాక్సిన్ తీసుకుంటే, వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. దీనిని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే వ్యాక్సిన్ తీసుకోని వారికి కూడా కొంత రక్షణ లభిస్తుంది. దీంతో సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.