Eluru: అటవీ శాఖలో ముడుపుల పర్వం.. అక్రమార్కులకు అధికారుల అభయం!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని అమరవరం అటవీ పరిధిలో కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

Update: 2026-04-04 01:20 GMT

Eluru: అటవీ శాఖలో ముడుపుల పర్వం.. అక్రమార్కులకు అధికారుల అభయం!

ఏలూరు జిల్లా: కుక్కునూరు మండలం అమరవరంఅటవీ రేంజ్ పరిధిలోని చీరవల్లి బీట్ లో ఎండ్ల నాటి భారీ వృక్షాలను మిషన్లతో కోయడంతోతోపాటు అక్రమంగా కలపను తరలిస్తూ అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. సంబంధిత అమరవరం రేంజ్ పరిధిలోని పలు గ్రామాల్లో రోజూ చెట్లను నరికి వివిధ ప్రాంతాలకు తరలిస్తూ కొందరు దళారులు సొమ్ముచేసుకుంటున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఎపుగా పెరిగిన చెట్లు నరికి వేతకు నరికివేతకు గురవుతున్న స్థానిక

అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికి లారీలకు లారీల కలపను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెట్లను మిషన్లతో కోసి కలప అక్రమ రవాణా చేస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. చెట్లు అధికంగా ఉంటేనే మంచి వాతావరణం, సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. చెట్లను పూర్తిగా నరికివేస్తే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికి అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై పెదవి విరుస్తున్నారు. ముమ్మాటికీ అటవీ శాఖ అధికారులు, కలప అక్రమ రవాణా చేసే అక్రమార్కులతో కుమ్మక్కై ఈ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

రాత్రి పగలు అనే తేడా లేకుండా చెట్లను నరికి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో లారీల్లో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు కలపను తరలిస్తున్నారు. పగటిపూట కలప అక్రమ రవాణా చేసే వ్యక్తులు ట్రాక్టర్లో అడుగున మారిజాతి కలప పేర్చి పైన జామాయిల్ కర్రలతో లోడ్లు చేసి దర్జాగా కలప అక్రమ రవాణా సాగిస్తున్నారు. కలప అక్రమ రవాణా గురించి స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం కోసం ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. స్థానిక అధికారులు చెట్లు నరికివేత అక్రమ రవాణా గురించి సమాచారం ఇచ్చిన స్పందించట్లేదని జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫోటోలు, వీడియోలు పంపి సమాచారం ఇస్తే వాటిని స్థానిక అటవీశాఖ అధికారులు పంపించి సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నత అధికారులు ఆదేశించగా, స్థానిక అధికారులు మాత్రం అవి ఎప్పుడో నరికిన చెట్ల మొదళ్లను ఇప్పుడు కొందరు కావాలని ఆ పాత వాటిని తమకు పంపించారని అందులో వాస్తవం లేదని ఉన్నతాధికారు లను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఆయన జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు జిపిఎస్ లాట్ లాంగ్ లోకేషన్ తో తీసిన ఫోటోలు, వీడియోలు పంపించిన వాటి మీద విచారణ జరపకుండా, స్థానిక అటవీశాఖ అధికారులు చెప్పిన మాటలను నమ్మి అవి ఎప్పుడో నరికిన చెట్ల మొదల్ల ఫోటోలను ఇప్పుడు పంపిస్తున్నారని అనడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. తీసిన ఫోటోలపై లాట్ లాంగ్ కోఆర్డినేషన్స్ తో పాటుగా తారీఖు, సమయం కూడా ఉంటుంది. ఆ తారీకు తీసిన ఫోటోలో మొదల్ల పై నంబర్లు లేకుండా ఉండడాన్ని అధికారులు గమనించడం లేదా, తరువాత స్థానిక అటవీశాఖ సిబ్బంది అవే మొదల్లఫై నంబర్లు వేసి ఫోటోలు,వీడియోలు తీసి జిల్లా ఉన్నతాధికారులకు పంపితే జిల్లా అటవీశాఖ అధికారులు ఆ మాత్రం తేడా గుర్తించకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

స్థానికులు పంపిన ఫోటోలో మొదల్లు పచ్చిగా ఉంటే, అధికారులు పంపే ఫోటల్లో మొదళ్లు పూర్తిగా ఎండిపోయి ఉన్నవి పంపి జిల్లా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అమరవరం రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి కలపను ఏదో ఒక ప్రాంతం నుంచి అక్రమంగా కలపను తరలిస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్రమ కలప తరలింపు వ్యవహారమంతా అటవీ శాఖ అధికారులకు తెలిసే నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేంజ్ పరిధిలో అక్రమంగా కలపను తరలిస్తున్నప్పటికీ ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం గమనార్హం. పత్రికల్లో వార్తలు వస్తే రెండు, మూడు రోజులు హడావిడి చేసి తర్వాత యథావిధిగా చూసీచూడనట్లు ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది.

కలప మాఫియా నుంచి ముడుపులు తీసుకొని కొందరు అధికారులు కలప మాఫియాకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారం స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటుగా సహకరిస్తున్న అవినీతి అధికారపై పూర్తి విచారణ జరిపించి శాఖ పురమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News