పీపీఏ బృందం పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) బృందం ఈ రోజు పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నిర్మాణం పనులను పరిశీలించింది.

Update: 2025-12-24 10:09 GMT

పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) బృందం ఈ రోజు పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నిర్మాణం పనులను పరిశీలించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈ ఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృందం ఇక్కడకు వచ్చింది. ప్రాజెక్ట్ లో నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2 ప్రాంతాలలో బృందం పర్యటిస్తోంది.


పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్న బృందానికి జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కె. నరసింహమూర్తి, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు స్వాగతం పలికారు. అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో బృందం సభ్యులు ఆ తరువాత సమావేశమై, పనుల గురించి చర్చించారు.

పీపీఏ సీఈఓతో పాటు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్ ) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి ), డైరెక్టర్ కె శంకర్ పోలవరంలో పర్యటిస్తున్నారు. 

Tags:    

Similar News