Maha Shivaratri 2026 Live Updates: తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
Maha Shivaratri 2026 Live Updates: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివయ్య దర్శనానికి బారులు తీరారు.
Maha Shivaratri 2026 Live Updates: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ శివయ్య దర్శనానికి బారులు తీరారు. ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, వేములవాడ, శ్రీకాళహస్తిలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నెల్లూరు మూలస్థానేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
-- శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ దంపతులు
-- సతీమణి రమాదేవితో కలిసి మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామిని దర్శించిన మంత్రి
-- కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు
-- ఆలయమర్యాదలతో పూర్ణకుంభస్వాగతం పలికిన అర్చకులు ,పాలకమండలి సభ్యులు
మంత్రి నారాయణ కామెంట్స్ :--
-- రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
-- కుటుంబసభ్యులతో కలిసి పరమశివుడిని దర్శించటం ఆనందంగా ఉంది .
-- అందరికీ అష్టైశ్వర్యాలు ,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకొన్నా
-- పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్ రూపొందించారు
-- ఉద్యోగ అవకాశాలతో, రాష్ట్రంలో ఆర్థికపరిస్థితి మెరుగుపడుతోంది
Maha Shivaratri 2026 Live Updates: కోటప్పకొండకు భక్తుల తాకిడి..బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు
Maha Shivaratri 2026 Live Updates: కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు
ఈ నెల 13 నుండి 18 వరకు ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
తెల్లవారు జాము నుంచే భారీగా ఆలయానికి తరలి వస్తున్న భక్తులు
వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
మహా శివరాత్రి పర్వదినాన భోళా శంకరుని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి అనే నమ్మకంతో భారీగా తరలి వస్తున్న భక్తులు
సమయం గడుస్తున్న కొద్ది క్యూ లైన్లలో పెరుగుతున్న భక్తుల సంఖ్య
తెల్లవారుజామునే ఆ మహా శివునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించిన ఆలయ అర్చకులు
Maha Shivaratri 2026 Live Updates: శ్రీ సత్య సాయి లేపాక్షి లో ఘనంగా శివరాత్రి వేడుకలు శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
Maha Shivaratri 2026 Live Updates: శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమవతి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా సిద్దేశ్వర స్వామి (శివుని ఆలయంలో) బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
ఈ హేమావతి ఆలయం ప్రత్యేకత ఏమంటే శివుడు లింగాకారంలో కాకుండా, మానవాకారంలో ఉండడం ఈ ఆలయ విశేషం.
మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ శివున్ని దర్శించడానికి ఉదయాన్నే అంద్ర నుంచే కాకుండా కర్ణాటక నుండి భారీ గా తరలివచ్చారు భక్తులు.
ఈ హేమావతి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 7 రోజులు జరుగుతాయి. అందులో భాగంగా నేడు రుద్రాభిషేకం, అఖండపూజలు నిర్వహించారు అర్చకులు.
Maha Shivaratri 2026 Live Updates: మావన ఆకారంలో మహా శివుడు..భక్తులకు ప్రత్యేక దర్శనం
Maha Shivaratri 2026 Live Updates: తూ.గో జిల్లాలో పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు
Maha Shivaratri 2026 Live Updates: తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రారంభమైన మహా శివరాత్రి వేడుకలు..
తిమ్మమాంబ రథోత్సవం ప్రారంభించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్..
గుస్సాడి నృత్యం, కూచిపూడి నాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఉత్సవాలు
Maha Shivaratri 2026 Live Updates: వేములవాడ రాజన్న కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్,
ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్