Tata Motors: టాటా కార్ల కొనుగోలుదారులకు పండుగే..ఈ 3 పాపులర్ మోడళ్లపై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపు
Tata Motors: సొంత కారు కొనాలనే ఆలోచనలో ఉన్న కార్ లవర్లకు ప్రముఖ స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.
Tata Motors
Tata Motors: సొంత కారు కొనాలనే ఆలోచనలో ఉన్న కార్ లవర్లకు ప్రముఖ స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు ఆఫర్ల కింద తన అత్యంత ప్రజాదరణ పొందిన మూడు మోడళ్లపై ఏకంగా రూ.1.25 లక్షల వరకు భారీ తగ్గింపు అందిస్తూ వాహన విపణిలో సరికొత్త ఊపు తెచ్చింది. స్వదేశీ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన విక్రయాలను పెంచే లక్ష్యంతో కస్టమర్ల కోసం ఈ ఆగస్టు ధమాకాను రంగంలోకి దించింది. నగదు డిస్కౌంట్లతో పాటు కార్పొరేట్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కూడిన ఈ ప్రత్యేక ప్యాకేజీ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ పొదుపు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ భారీ ఆఫర్లను సొంతం చేసుకోవడానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో షోరూమ్‌ల వైపు వాహన ప్రియులు అడుగులు వేస్తున్నారు. బడ్జెట్ పరిమితులతో కారు కొనుగోలును వాయిదా వేసుకుంటున్న కుటుంబాలకు ఇది ఎంతో మేలు చేయనుంది.
టాటా కర్వ్‌పై అత్యధికంగా రూ.1.25 లక్షల డిస్కౌంట్
టాటా సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చి విశేష ఆదరణ పొందుతున్న ఎస్‌యూవీ-కూపే మోడల్ టాటా కర్వ్‌పై కస్టమర్లు అత్యధికంగా రూ.1.25 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. భిన్నమైన శైలి, ఆధునిక ఫీచర్లు ఉన్న ఈ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ హైపరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఐచ్ఛికాలలో లభిస్తోంది. భారతీయ మార్కెట్‌లో ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల నుంచి ఆరంభమై రూ.19.50 లక్షల వరకు ఉంది. పెద్ద మొత్తంలో రూపుదిద్దుకున్న ఈ డిస్కౌంట్ కారు ప్రియులను ఆకట్టుకుంటోంది.
హాట్ కేకులా అమ్ముడయ్యే టాటా నెక్సాన్ పై రూ. 75,000 ఆదా
దేశీయ మార్కెట్లో రికార్డు స్థాయి సేల్స్‌తో దూసుకుపోతున్న టాటా నెక్సాన్ కొనుగోలుపై కూడా కస్టమర్లు గరిష్ఠంగా రూ.75,000 వరకు ఆదా చేసుకోవచ్చు. సురక్షితమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన ఈ పాపులర్ ఎస్‌యూవీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ల కాంబినేషన్‌తో పాటు కంపెనీ ఫిట్టెడ్ సిఎన్‌జి వెర్షన్‌లోనూ లభిస్తోంది. ప్రసిద్ధ నెక్షన్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.8 లక్షల నుంచి ప్రారంభమై రూ.15.60 లక్షల వరకు ఉన్నాయి.
ప్రీమియం హాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్‌పై స్పెషల్ బెనిఫిట్స్
సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తనదైన ముద్ర వేసిన టాటా ఆల్ట్రోజ్ కారుపై రూ.55,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్‌తో పాటు సిఎన్‌జి ఆప్షన్‌లో కస్టమర్లకు లభిస్తోంది. ఈ ప్రీమియం కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.65 లక్షల నుంచి రూ.11.30 లక్షల మధ్య కొనసాగుతోంది.