Mahindra: మహీంద్రా ఈవీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కార్లలో జనవరి 2027 నుంచి అదిరిపోయే ఫీచర్

Mahindra: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ అందించింది.

Update: 2026-08-28 04:12 GMT

Mahindra EV

Mahindra: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ అందించింది. తన బోర్న్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని ఎలక్ట్రిక్ కార్లలో గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. 2027 జనవరి నాటికి ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. మహీంద్రా ఇన్-కార్ MAIA అసిస్టెంట్‌ను గూగుల్ జెమిని పవర్‌ఫుల్ ఏఐ టెక్నాలజీతో అనుసంధానించారు. ఈ టెక్ టాక్ ప్యాకేజీలో 17 ప్రత్యేక ఏఐ ఏజెంట్లు పనిచేస్తాయి. 100 కంటే ఎక్కువ ప్రధాన విధులు, 48 రకాల యాప్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్‌లు నావిగేషన్, వినోదం, కారు కంట్రోల్స్, సాధారణ విశేషాల గురించి కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారా మాట్లాడి పనులు పూర్తి చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన బీఈ 6 స్పోర్టెక్ మోడల్‌తో పాటు ఎక్స్ఈవి 9ఈ, ఎక్స్ఈవి 9ఎస్, పాత బీఈ 6 కస్టమర్లకు ఓటీఏ అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్ లభిస్తుంది.

సేఫ్టీకి పెద్దపీట వేసే టెక్ సెక్యూర్

కారు సేఫ్టీని పర్యవేక్షించేందుకు టెక్ సెక్యూర్ ప్యాకేజీని అందించారు. ఇందులో ఉన్న 360-డిగ్రీ కెమెరా, డాష్‌క్యామ్ ద్వారా వాహనాన్ని ఎప్పటికప్పుడు గమనించవచ్చు. మీ4యు యాప్ ద్వారా లైవ్ వీడియో చూడటం, ఆడియో ట్రాకింగ్ చేయడం, డిజిటల్ కార్-కీ ఉపయోగించడం సులభమవుతుంది. అలాగే టెక్ మీ ఫీచర్ డ్రైవర్ ముఖాన్ని లేదా ప్రొఫైల్‌ను గుర్తించి సీటు పొజిషన్, మిర్రర్ల అమరిక, ఏసీ ఉష్ణోగ్రత, డిస్ప్లే సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా మార్చేస్తుంది.

థ్రిల్లింగ్ డ్రైవింగ్ అనుభవం

డ్రైవింగ్ ఔత్సాహికుల కోసం టెక్ డ్రైవ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో కంట్రోల్డ్ డ్రిఫ్టింగ్ కోసం ఈఎస్పీని పూర్తిగా నిలిపివేసే 'డ్రిఫ్ట్ మోడ్' ఉంది. అత్యంత కీలకమైన రివైవ్ మోడ్ కారు ఛార్జింగ్ 0 శాతానికి పడిపోయినప్పటికీ సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌కు చేరుకోవడానికి అదనంగా 13 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అత్యవసర సమయంలో ‘రివైవ్ ఎస్ఓఎస్’ మోడ్ ద్వారా మరొక 11 కిలోమీటర్ల ప్రయాణం సాధ్యమవుతుంది. అయితే ఈ ఎమర్జెన్సీ ఫీచర్‌ను వాహనం జీవితకాలంలో కేవలం ఐదు సార్లు మాత్రమే వాడగలరు.

కారులోనే గేమింగ్, రంగుల వెలుగుల హంగామా

వినోదం కోసం టెక్ ప్లే ప్యాకేజీని రూపొందించారు. బ్లూటూత్ కంట్రోలర్ల ద్వారా కారులోనే నలుగురు వ్యక్తులు గేమ్స్ ఆడుకోవచ్చు. కారఓకే సిస్టమ్‌తో పాటు పాటల సంగీతానికి అనుగుణంగా కారు లోపల, బయట వెలిగే లైటింగ్‌ను సింక్ చేసే గ్రూవ్‌మీ పార్టీ ఫీచర్ యూత్‌ను అమితంగా ఆకట్టుకోనుంది.  

Tags:    

Similar News