Toyota: రూపురేఖలు మార్చుకున్న టయోటా ఇన్నోవా హైక్రాస్.. డిజైన్ చూస్తే పిచ్చెక్కాల్సిందే
Toyota: భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో లాంచ్ కాబోతోంది.
Toyota Innova
Toyota: భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో లాంచ్ కాబోతోంది. 2022లో విడుదలైన ఈ పాపులర్ ఎమ్‌పీవీ రూపురేఖలను మరింత పవర్‌ఫుల్‌గా మారుస్తూ టయోటా సరికొత్త ఫ్రంట్ డిజైన్ పేటెంట్‌ను హక్కులను పొందింది. ఈ కొత్త లుక్స్ కార్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వివరాలు ఆటో కార్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా బయటకు వచ్చిన లీక్డ్ డిజైన్ పేటెంట్ ప్రకారం, ఈ వాహనం ముందరి భాగం మునుపటి కంటే చాలా రఫ్‌గా కనిపించనుంది. టయోటాకు చెందిన పాపులర్ పికప్ ట్రక్ హైలక్స్ తరహాలోనే వెడల్పాటి స్క్వేర్ గ్రిల్‌ను ఇందులో అమర్చారు. ఇందులో డైమండ్ షేప్ ఎయిర్ ఇన్‌లెట్స్ ప్రత్యక్షమవుతాయి. బంపర్ రెండు వైపులా ఫాగ్ లాంప్స్ కోసం ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. ముందు ఉన్న ప్రొజెక్టర్ హెడ్‌లైట్లను మరింత స్లిమ్‌గా డిజైన్ చేయడం వాహనానికి స్పోర్టీ లుక్‌ను తెచ్చిపెట్టింది.
లగ్జరీ ఇంటీరియర్.. సరికొత్త అల్లాయ్ వీల్స్
వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌లో సరికొత్త ఎలిమెంట్లను జోడించారు. పక్క భాగం, రేర్ బంపర్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ కొత్త మోడల్‌కు ప్రీమియం లుక్ ఇచ్చేందుకు వీలుగా అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను మార్చారు. ఇంటీరియర్ విషయానికి వస్తే, క్యాబిన్ ఓవరాల్ లేఅవుట్‌లో మార్పులు చేయకుండా ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేలను యథాతథంగా కొనసాగించనున్నారు. సీట్ అప్‌హోల్‌స్టరీతో పాటు కొత్త కలర్ ఆప్షన్లతో లోపలి వాతావరణాన్ని మరింత లగ్జరీగా తీర్చిదిద్దేందుకు సంస్థ సమాయత్తమవుతోంది.
పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు
సాంకేతిక వివరాలు పరిశీలిస్తే ఇంజిన్ విభాగంలో ఎలాంటి పెద్ద మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుత మోడల్‌లో ఉన్న పవర్‌ట్రెయిన్‌లనే టయోటా ఇందులో కూడా కొనసాగించనుంది. 173 హెచ్‌పీ పవర్ ఇచ్చే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను సివిటి గేర్‌బాక్స్‌తో, అలాగే 184 హెచ్‌పీ పవర్ ఇచ్చే 2.0-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌ను ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో అందించనున్నారు. మైలేజ్ విభాగంలో ఈ హైబ్రిడ్ ఇంజిన్ తన సత్తా చాటుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫార్చ్యూనర్ నుంచి కూడా గుడ్ న్యూస్
ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇన్నోవా హైక్రాస్ ధర రూ.18.90 లక్షల నుంచి మొదలై రూ.31.84 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. నయా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సరికొత్త ఫీచర్లతో వస్తున్నందున ధర కాస్త పెరిగే అవకాశం ఉంది. ఇదే క్రమంలో టయోటా సంస్థ నుంచి ఫార్చ్యూనర్ కొత్త మోడల్ కూడా త్వరలోనే రాబోతోంది. కొత్త టీఎన్‌జీఏ-ఎఫ్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటున్న నయా ఫార్చ్యూనర్ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టనుంది.