Mahindra: మహీంద్రా ఈవీ లవర్లకు శుభవార్త..XEV 9S, XEV 9e ధరలు భారీగా తగ్గింపు

Mahindra: ప్రముఖ స్వదేశీ దిగ్గజం మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Update: 2026-08-29 02:16 GMT

Mahindra

Mahindra: ప్రముఖ స్వదేశీ దిగ్గజం మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన పాపులర్ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) పథకాన్ని ఇప్పుడు బోర్న్ ఎలక్ట్రిక్ సిరీస్‌లోని XEV 9S, XEV 9e మోడళ్లకు సైతం విస్తరిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. దీనితో కొత్త కార్ల ప్రారంభ ధరలు సగానికి పైగా తగ్గి సాధారణ వినియోగదారులకు మరింత చేరువయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో ప్రధాన భారంగా మారే బ్యాటరీ ఖర్చును మినహాయించి కార్లను విక్రయించడమే ఈ బాస్ ప్లాన్ ప్రధాన ఉద్దేశం. ఇన్నాళ్లూ కేవలం బిఈ 6 స్పోర్టెక్ మోడల్‌కే పరిమితమైన ఈ అవకాశాన్ని ఇప్పుడు పూర్తి స్థాయి INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఎస్‌యూవీల అన్ని వేరియంట్లకు అమలు చేస్తున్నారు. ఈ ప్లాన్ కింద కారు కొనేటప్పుడు బ్యాటరీకి ఒకేసారి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాహనం కొనుగోలు చేశాక తిరిగే ప్రతి కిలోమీటరుకు నిర్ణీత రుసుము ప్రాతిపదికన బ్యాటరీ చార్జీలు వర్తిస్తాయి.

తగ్గిన ఎస్‌యూవీల కొత్త ధరల వివరాలు

మహీంద్రా సరికొత్త నిర్ణయంతో XEV 9S ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.65 లక్షలకు దిగివచ్చింది. దీనికి తోడు బ్యాటరీ వాడకం కోసం ప్రతి కిలోమీటరుకు రూ.3.75 వంతున పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరొక ప్రీమియం వెర్షన్ XEV 9e ప్రారంభ ధర రూ.13.90 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారుకు కూడా అదే విధంగా కిలోమీటరుకు రూ. 3.75 బ్యాటరీ ప్లాన్ వర్తిస్తుంది. గతంలో విడుదల చేసిన బిఈ 6 స్పోర్టెక్ ఎక్స్-షోరూమ్ ధర కూడా బాస్ స్కీమ్‌తో రూ.11.45 లక్షల నుంచి అందుబాటులోకి రావడం విశేషం.

ఎలా పనిచేస్తుంది ఈ ప్లాన్?

ఇది కేవలం వాడిన దానికి మాత్రమే చెల్లిం పే-పర్-యూజ్ మోడల్ కాదు. థర్డ్ పార్టీ ఫైనాన్స్ సంస్థల ద్వారా అందించే రుణం. సాధారణంగా రోజుకు 60 కిలోమీటర్ల ప్రయాణ పరిమితి, నిర్ణీత డౌన్ పేమెంట్, రూ.6,975 ల ప్రారంభ నెలవారీ ఈఎంఐ లెక్క ఆధారంగా ఈ రూ.3.75 లెక్కింపును రూపొందించారు. కారు సొంతం చేసుకోవాలనుకునే మధ్యతరగతి వినియోగదారులకు ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించే భారాన్ని తగ్గించడంలో ఈ విధానం ఎంతో తోడ్పడుతుంది.

కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

కంపెనీ ప్రకటించిన ఈ ఆకర్షణీయమైన ఎక్స్-షోరూమ్ ధరల్లో కారు చార్జర్ ఖర్చు, హోమ్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు, మెయింటెనెన్స్, రోడ్డు టాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రభుత్వ పన్నులు చేర్చలేదు. వాటిని కొనుగోలుదారులు విడిగా భరించాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మహీంద్రా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక బాస్ సౌకర్యం కేవలం వ్యక్తిగత అవసరాల కోసం వాహనాలు కొనేవారికి మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ ప్రయోజనాల కోసం కొనుగోలు చేసే కార్లకు ఈ స్కీమ్ వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది.

Tags:    

Similar News