YSR Telangana Party: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం
YSR Telangana Party: తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ఆవిర్భవించింది.
YSR Telangana Party: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం
YSR Telangana Party: తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ఆవిర్భవించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభించారు. పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణగా ఆమె స్వయంగా ప్రకటించారు. పార్టీకి చెందిన జెండాను విజయమ్మతో కలిసి డిజిటల్ స్క్రీన్‌పై ప్రారంభించారు. హైదరాబాద్ రాయదుర్గలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికపై వైఎస్ షర్మిల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాగా పార్టీ జెండాను పాలపిట్ట, నీలం రంగుతో కూడిన తెలంగాణ మ్యాప్‌తో పాటు మధ్యలో వైఎస్ఆర్ ఫోటోతో రూపోందించారు.
పార్టీ జెండా అవిష్కరణ అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ నాయకత్వాన్ని నిలబెడతానని, తెలంగాణలో వైఎస్‌ఆర్ పాలన తీసుకొస్తానన్నారు. నాన్న మాట ఇస్తే.. బంగారు మూట ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత మన వైఎస్‌ఆర్ అని షర్మిల తెలిపారు.